Home న్యూస్ RRR ట్రైలర్ రివ్యూ….అల్లకల్లోలం చేశారు!

RRR ట్రైలర్ రివ్యూ….అల్లకల్లోలం చేశారు!

0

మాస్టర్ ఆఫ్ స్టొరీ టెల్లింగ్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మమ్మోత్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎప్పటి నుండో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా జనవరి 7న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా….

సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వదిలారు మేకర్స్….ట్రైలర్ చూసిన తర్వాత సింపుల్ గా చెప్పాలి అంటే…మీరు ఎన్ని అంచనాలు అయినా పెట్టుకుని థియేటర్స్ కి వెళ్ళండి…. థియేటర్స్ లో సినిమా చూస్తున్నంత సేపు మీ అంచనాలను అన్నీ కూడా మించే రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా….

థియేటర్స్ అన్నీ అల్లకల్లోలం చేస్తూ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తే ఏం సినిమా రా బాబు అనిపించడం ఖాయం అనిపించే రేంజ్ లో మెప్పించింది. ఓపెన్ అవ్వడం ఎన్టీఆర్ షాట్స్ తో ఓపెన్ అయ్యి తర్వాత రామ్ చరణ్ షాట్స్ తో మంచి కిక్ ఇస్తూ ఇద్దరి ఫ్రెండ్ షిప్ ని చూపెడుతూ…

వేరు వేరు దార్లలో ఉన్న వాళ్ళ అసలు దారి అది కాదని, అసలు పోటికి సిద్ధం అవుతూ బ్రిటిష్ వారిపై పోరాడుతూ వీళ్ళు అనుకున్నది సాధించారా లేదా అన్నది అసలు కథ. ట్రైలర్ లో ఎన్టీఆర్ పులి పైనే గాండ్రించడం, అలాగే నిప్పుల నుండి బాణం వదులుతూ రామ్ చరణ్ కనిపించే షాట్స్ ఊహకందని ఫీల్ ని కలిగించాయి.

బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది కానీ ఇద్దరు హీరోలు ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ ని సైతం డామినేట్ చేస్తూ తమ స్క్రీన్ ప్రజెన్స్ తో మెస్మరైజ్ చేశారు. ఇతర రోల్స్ గ్లిమ్స్ ని చూపెట్టినా ఇద్దరు హీరోల ఎలివేషన్స్ తోనే ట్రైలర్ నిండిపోగా అసలు సిసలు ఎలివేషన్ల మజా థియేటర్స్ లో ఉండబోతుంది అన్న ఆసక్తిని పెంచింది ట్రైలర్… ఇక ట్రైలర్ 24 గంటల్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here