Home గాసిప్స్ RRR ఇంటర్వెల్ సీన్ 53 ఏళ్ల క్రితం సినిమా నుండి తీసుకున్నారా!!

RRR ఇంటర్వెల్ సీన్ 53 ఏళ్ల క్రితం సినిమా నుండి తీసుకున్నారా!!

0

తెలిసో తెలియకో అప్పుడప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాలు ఇది వరకు వచ్చిన సినిమాలో ఉన్నట్లు అనిపించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది కొందరు కావాలని ఇన్స్పైర్ అయ్యి చేస్తే కొందరు అనుకోకుండా చేస్తూ ఉంటారు. ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఇంటర్వెల్ లో ఇద్దరు హీరోల రియల్ ఐడెంటిటీ రివీల్ చేసుకుని నువ్వా నేనా అన్నట్లు పోరాడే సన్నివేశాలు ఆడియన్స్ ను…

ఓ రేంజ్ లో థ్రిల్ అయ్యేలా చేశాయి అని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ పై సోషల్ మీడియా లో ఓ హాట్ టాపిక్ నడుస్తుంది. ఇంటర్వెల్ సీన్ ను సుమారు 53 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన తెలుగు సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు….

తెరకెక్కించారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు… 1969 లో సూపర్ స్టార్ కృష్ణ మరియు శోభన్ బాబుల కాంబినేషన్ లో మంచి మిత్రులు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో కూడా ఇద్దరు హీరోలు కూడా ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే స్నేహితులు అవుతారు… అందులో కృష్ణ దొంగ కాగా శోభన్ బాబు పోలిస్….

ఒక సన్నివేశంలో దొంగని పట్టుకోవడానికి మారువేషంలో వచ్చిన పోలిస్ ను నేనే నని శోభన్ బాబు చెబుతాడు…. దాదాపు ఆర్ ఆర్ ఆర్ లో కూడా ఇలానే జరుగుతుంది. ఒకరి దగ్గర ఒకరు నిజం దాచాగా ముందు ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ లు నిజాలు తెలుస్తాయి…. దాంతో ఈ సీన్ అప్పటి సినిమా నుండి ఇన్స్ పైర్ అయ్యి తెరకెక్కించారు అంటూ…

సోషల్ మీడియాలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి సినిమాల్లో కొన్ని సీన్స్ ఇతర సినిమాల నుండి ఇన్ స్పైర్ అయ్యి తీస్తారు అన్న టాక్ ఉండటం ఇప్పుడు ఇది కూడా అదే కోవలోకి వచ్చిన సీన్ అంటున్నారు కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందొ ఎవ్వరికీ తెలియదు అనే చెప్పాలి. బాక్స్ అఫీస్ దగ్గర ఆర్ ఆర్ ఆర్ ఆల్ టైం ఎపిక్ రికార్డులు తెలుగు వర్షన్ కి గాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here