Home న్యూస్ తమిళ్ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించిన చిన్న సినిమా…వీకెండ్ లో మాస్ కలెక్షన్స్!

తమిళ్ కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించిన చిన్న సినిమా…వీకెండ్ లో మాస్ కలెక్షన్స్!

1866
0

అప్పుడప్పుడు కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉంటాయి. టాలీవుడ్ లో ఈ ఇయర్ కొన్ని చిన్న సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తమిళ్ లో మాత్రం ఈ ఇయర్ చిన్న సినిమాలు పెద్దగా సంచలనాలు సృష్టించలేదు, కానీ ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత అక్కడ ఓ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ ను…

ఓ రేంజ్ లో షేక్ చేస్తూ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. తెలుగు లో ఏ ఫిల్మ్ బై అరవింద్, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాంటి సినిమాల్లో యాక్ట్ చేసిన రిచర్డ్ రిషీ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ రుద్ర తాండవం సినిమా ఆడియన్స్ ముందుకు…

లాస్ట్ వీకెండ్ లో వచ్చింది… సిటీలో డ్రగ్స్ ఉండకూడదు అని సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న పోలిస్ అయిన హీరోని రాజకీయాలు చేసి ఓ కాస్ట్ గొడవల్లో ఇరికిస్తారు. తర్వాత హీరో ఫేస్ చేసిన పరిస్థితులు, పరిస్థితులను ఎలా తిరిగి సెట్ చేశాడు అన్న కథగా కొన్ని రియల్ ఇంసిడెంట్ లను బేస్ చేసుకుని…

ఈ సినిమాను తెరకెక్కించారట, ట్రైలర్ యావరేజ్ గా ఉండగా గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మూడు రోజుల వీకెండ్ లో ఒక్క తమిళనాడులోనే 8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలన ఓపెనింగ్స్ తో దూసుకు పోతుందట ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఆల్ మోస్ట్…

10 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంటున్నారు. ఓ చిన్న సినిమా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అక్కడ దక్కించుకోవడం తో ట్రేడ్ వర్గాలు తమిళ్ లో ఆల్ మోస్ట్ పరిస్థితులు ఇప్పుడు సెట్ అయినట్లే అన్న ధీమాతో ఉన్నారు, ఇక సినిమా వీకెండ్ కే ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసిందని, మొదటి వారంలోనే సాలిడ్ లాభాలను అందుకుంటుంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here