నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ ఇయర్ 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా 2 సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యాయి. ఇలాంటి సమయం లో తనకి జై సింహా తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో రూలర్ అంటూ మాస్ టైటిల్ తో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు బాలయ్య.. కాగా సినిమా అఫీషియల్ టీసర్ నేడు రిలీజ్ అవ్వగా ట్రైలర్ స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
ముందుగా ట్రైలర్ హైలెట్స్ విషయానికి వస్తే…బాలయ్య డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, భారీ స్టార్ కాస్ట్ అండ్ యాక్షన్ సీన్స్ టీసర్ లో హైలెట్స్ గా నిలవగా టోని స్టార్క్ లుక్ ని పోలి ఉన్న బాలయ్య లుక్ కూడా టీసర్ లో హైలెట్ అయింది. ఇక డైలాగ్స్ విషయంలో మరోసారి సత్తా చాటుకున్నాడు బాలయ్య…
“ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటెనే బోనులో పెట్టిన సింహం లా ఉంటాను ….యూనిఫామ్ తీసానా బయటికి వచ్చిన సింహంలా ఆగను…… ఇక వేటే!” అన్న డైలాగ్ బాగానే పేలింది. ఇక విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే అనిపిస్తున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…
టీసర్ లో టోని స్టార్క్ లుక్ తప్పితే మిగిలిన లుక్స్ విషయంలో ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు అనేది క్లియర్. ఆ లుక్స్ బాలయ్య కి ఏమాత్రం సెట్ కాలేదు. ఆ లుక్స్ ఒక్కటే టీసర్ కి మైనస్ అయ్యాయి. అదొక్కటి టీసర్ కి మైనస్ గా నిలిచాయి అని చెప్పాలి. కానీ చాలా టైం గ్యాప్ తర్వాత…
బాలయ్య పోలిస్ రోల్ చేస్తుండటం తో సినిమా కంటెంట్ లో సత్తా ఉంటె ఈ మైనస్ పాయింట్ పెద్దగా ఇంపాక్ట్ చూపే అవకాశం తక్కువే అని చెప్పాలి. ఓవరాల్ గా టీసర్ లుక్స్ పరంగా నిరాశ పరిచినా ఓవరాల్ గా మెప్పించింది అని చెప్పొచ్చు, ఇక డిసెంబర్ 20 న బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.