2019 టాలీవుడ్ సెకెండ్ ఆఫ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమాలు సాహో మరియు సైరా నరసింహా రెడ్డి. ఈ రెండు సినిమాలు ఇప్పుడు కేవలం నెలన్నర గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా వీటిలో ముందుగా ప్రభాస్ బాహుబలి తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని చేసిన సాహో ఈ నెల 30 న రిలీజ్ అవుతుంది. ఇక 10 ఏళ్ళకి ఖైదీ నంబర్ 150 తో మెగా కంబ్యాక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి…
మళ్ళీ 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని చేసిన సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఇప్పుడు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం రెండు సినిమాల అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్లు ఒకే రోజున రిలీజ్ అయ్యే చాన్స్ ఉందట.
ఆ డేట్ మరేదో కాదు ఈ నెల 15 న స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. సాహో ట్రైలర్ ఆ డేట్ కి ఆల్ మోస్ట్ కన్ఫాం అవ్వగా సైరా స్టొరీ లైన్ ప్రకారం ఆ రోజు ట్రైలర్ ని రిలీజ్ చేస్తే బాగుంటుందని యూనిట్ భావిస్తుందని సమాచారం. కానీ రిలీజ్ కి నెలన్నర ముందే ట్రైలర్ ని రిలీజ్ చేస్తారా అన్న…
అనుమానం ఉన్నా కానీ…. ఆ రోజున ట్రైలర్ కాకున్నా మరో టీసర్ ని అయినా రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. ఈ ఇయర్ తెలుగు లో బిగ్ బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న సినిమాలు అవ్వడం తో ఈ రెండు సినిమా ల పై కూడా అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్న సినిమాలుగా చెప్పుకుంటున్న ఈ రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి అద్బుతాలు సృష్టిస్తాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.