Home గాసిప్స్ సాహో సెన్సార్ రివ్యూ…ఈ టాక్ ఏంటి సామి!

సాహో సెన్సార్ రివ్యూ…ఈ టాక్ ఏంటి సామి!

2171
0

     బాహుబలి తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాహుబలి 2 తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకుని ఎంతో కష్టపడి చేసిన సినిమా సాహో తో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు ప్రభాస్. కాగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న సాహో సినిమా కి యు/ఏ సర్టిఫికేట్ లభించగా సినిమా రన్ టైం…

మొత్తం మీద 2 గంటల 51 నిమిషాలుగా ఉందని కన్ఫాం చేశారు, ఇక సినిమా కి సెన్సార్ నుండి లీక్ అయిన టాక్ మాత్రం అల్ట్రా పాజిటివ్ గా ఉందని చెప్పొచ్చు. స్టొరీ ఏంటి అనేది ట్రైలర్ లోనే చెప్పడం తో సినిమా మొత్తం స్క్రీన్ ప్లే బేస్ తో ఉంటుందని చెబుతున్నారు.

2000 కోట్ల రాబరీ చేసిన దొంగలను పట్టుకోవడానికి వెళ్ళే హీరో ప్రయాణం లో ఎలాంటి మలుపులు వచ్చాయి, అసలు ఆ 2000 కోట్ల రాబరీ చేసింది ఎవ్వరూ అనేది మాత్రం చాలా ఆసక్తిగా తెరకెక్కించారని, సినిమాలో ఫైట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ అలాగే…. మైండ్ బ్లాంక్ చేసే క్లైమాక్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

సెన్సార్ నుండి ప్రతీ పెద్ద సినిమా కి పాజిటివ్ టాక్ రావడం కామన్ కానీ సాహో కి టాక్ మరింత పాజిటివ్ గా రావడం మాత్రం కొంచం షాకింగ్ గానే ఉంది, సెన్సార్ నుండి వినిపిస్తున్న టాక్ బయట రిలీజ్ అయిన తర్వాత కూడా కంటిన్యు అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను….

సాహో సినిమా బ్రేక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు, సినిమా టోటల్ గా 270 కోట్లకు పైగా బిజినెస్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కి 272 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, తెలుగు అండ్ హిందీ వర్షన్ లు మేజర్ గా కలెక్షన్స్ ని రాబట్టాల్సి ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here