బాహుబలి లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా అంటే క్రేజ్ ఏ లెవల్ లో ఉండాలో అదే లెవల్ లో క్రేజ్ ని రిలీజ్ ని సొంతం చేసుకుంది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సెన్సేషనల్ మూవీ సాహో సినిమా, ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 8200 వరకు థియేటర్స్ లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ లో కూడా రికార్డ్ లెవల్ లో రిలీజ్ అయ్యింది…
అందులో అమెరికాలో 620 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమా అనుకున్న సమయానికి ప్రింట్స్ వెళ్లకపోవడం ఎక్కువ క్రేజ్ ఉండే తెలుగు ఏరియాల్లో హిందీ షోలు వేయడం, టికెట్ రేట్లు భారీ గా పెంచడం లాంటివి చేసి షాక్ ఇచ్చింది.
ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ప్రీమియర్ షో కలెక్షన్స్ పై స్పష్టంగా కనిపించగా ఓవర్సీస్ లో రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ వస్తాయి అనుకుంటే ప్రీమియర్ షోలకు అతి కష్టం మీద 0.92 మిలియన్ మార్క్ ని మాత్రమె అందుకుని సాహో సినిమా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అమెరికాలో. కాగా మిగిలిన చోట్ల కూడా 2K ప్రింట్స్ లేట్ గా వెళ్ళడం లాంటివి జరిగాయట.
ఆగస్ట్ 15 న అయితే అన్ని సరిగ్గా సమయానికి రెడీ కావు అని 15 రోజుల టైం తీసుకుని సినిమా ను పోస్ట్ పోన్ చేసిన నిర్మాతలు, సరిగ్గా రిలీజ్ సమయానికి ప్రింట్స్ రెడీ చేయకపోవడం, సరిగ్గా రిలీజ్ ను ప్లాన్ చేయక పోవడం ప్రీమియర్ షో కలెక్షన్స్ పై భారీ ఇంపాక్ట్ ని చూపాయి.
దాంతో ఓవర్సీస్ లో సినిమా ప్రీమియర్ షోలతో నిరాశ పరిచే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, కానీ మొదటి రోజు నుండి అన్ని షోలు అనుకున్నట్లు పడతాయి అంటూ చెబుతుండటం తో ఈ రోజు నుండి సినిమా కలెక్షన్స్ అక్కడ ఎలా ఉంటాయి అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు.