2019 మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో నేడు ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చేసింది, 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మమ్మోత్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 8200 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ముందుగా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది, ఇక అసలు సిసలు రివ్యూ లో సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ విషయానికి వస్తే 2000 కోట్ల రాబరీ రికవరీ చేయడానికి హీరో హీరోయిన్స్ వాజీ అనే సిటీ కి వెళతారు, అక్కడ 2 గ్యాంగ్స్ ఉండగా ఒక గ్యాంగ్ లీడర్ గా జాకీ ష్రాఫ్ మరో గ్యాంగ్ లీడర్ గా చంకీ పాండే ఉంటారు..జాకీ ష్రాఫ్ కి వయసు అవ్వడం తో అపోజిట్ గ్యాంగ్ ఈయనని చంపి టోటల్ సిటీ ని తమ కంట్రోల్ లో పెట్టుకోవాలి అనుకుంటారు. అసలు ఆ వాజీ సిటీ కి ఈ రాబరీ కి లింక్ ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథ పాయింట్ ఇదొక్కటే కాదు ఇందులో మరిన్ని ఉప కథలు ఉంటాయ్, అవన్నీ చెబితే త్రిల్ మిస్ అవుతుంది కాబట్టి చెప్పడం లేదు, కథ పాయింట్ ని పక్కకు పెడితే ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ కొన్ని సీన్స్ లుక్స్ సెట్ కాలేదు కానీ ఓవరాల్ లుక్స్ అండ్ స్టైల్, యాటిట్యూడ్ అన్నీ ఆకట్టుకోగా యాక్షన్ సీన్స్ బాగా చేసి సినిమాను తన భుజాన మోశాడు.
ఇక శ్రద్ధ కపూర్ రోల్ కూడా బాగానే ఉండగా తన పెర్ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది, ఇక ఇతర నటీనటులు చాలా మంది ఉండగా అందరు కూడా తమ రోల్ మేరకు నటించి మెప్పించగలిగారు. ఇక సంగీతం విషయానికి వస్తే ఒకటి రెండు పాటలు తప్ప సినిమా ఆడియో ఫ్లాఫ్ అనే చెప్పాలి.
ప్రేక్షకులను ఎంగేజ్ చేయాలి అంటే పాటలు కూడా కీలక భూమిక పోషిస్తాయి, చిన్న సినిమాల్లో పాటల వల్ల హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి, కానీ 350 కోట్ల సినిమా మొత్తం యాక్షన్ సీన్స్ చూడటానికే వస్తారు అనుకుని సాంగ్స్ ని నిర్లక్ష్యం చేశారు. కానీ అదే సమయం లో బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది, కొన్ని సీన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉన్నాయి, యాక్షన్ సీన్స్ తప్పిస్తే మిగిలిన సీన్స్ తెరపై ముందుకు వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటూ కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తుంది, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే సుజీట్ డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. చిన్న స్టొరీ పాయింట్ ని 350 కోట్ల తో తీయాల్సిన అవసరం అస్సలు లేదు.
అందులో బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ అప్ కమింగ్ మూవీ లో ప్రేక్షకులు కోరుకునే అంశాలు వీరోచితమైన హీరో ఎలివేషన్ సీన్స్ కానీ సుజీత్ భారీ గ్రాండియర్ మీద పెట్టిన శ్రద్ధ ప్రభాస్ ని ఎలివేట్ చేసే సీన్స్ పై అస్సలు పెట్టలేదు. అలాగే ప్రభాస్ లుక్స్ పై కూడా శ్రద్ధ తీసుకోలేదు…
తన అనుభలేమి తో సినిమా బడ్జెట్ పెరిగింది, VFX అనుకున్న రేంజ్ లో రాలేదు అన్నది నిజం, కానీ ఉన్నంతలో ఇన్ని తప్పులు చేసినా కొన్ని యాక్షన్ సీన్స్ అండ్ భారీ గ్రాండియర్ ని చూపెట్టే విషయం లో మెప్పించాడు సుజీత్… ఇక సినిమా లో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే…
ఫస్ట్ 20 నిమిషాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అని చెప్పాలి, ఇక మైనస్ ల విషయానికి వస్తే స్టొరీ బలంగా లేకపోవడం, సంగీతం, స్టొరీ కనెక్ట్ అయ్యేలా లేక పోవడం, స్లో నరేషన్, కొన్ని చోట్ల వీక్ VFX, యాక్షన్ డోస్ ఎక్కువ అవ్వడం, ఎంటర్ టైన్ మెంట్ అస్సలు లేకపోవడం లాంటివి మేజర్ మైనస్ పాయింట్స్….
భారీ బడ్జెట్ ఉన్నంత మాత్రానా అన్ని సినిమాలు బాహుబలి లు, KGF లు అవ్వవు, ఆ సినిమాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడానికి కారణం అందులో ఉన్న యాక్షన్ సీన్స్ ఒక్కటే కాదు, ప్రేక్షకులు ఓన్ చేసుకునే ఎమోషన్స్ అందులో ఉండటం, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ అడుగడుగునా ఉండటం,
వాటికి సంగీతం, యాక్షన్ సీన్స్ తోడూ అయ్యి అవి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాయి. వాటితో సాహో ని కంపేర్ చేస్తే కేవలం యాక్షన్ సీన్స్ అండ్ గ్రాండియర్ తప్పితే మిగిలిన విషయంలో అసలు కథ విషయం లో కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టం…అయినా కానీ ప్రభాస్ చాలా వరకు సినిమా ను మోశాడు.
ఓవరాల్ గా సినిమా మరీ అద్బుతం కాదు, కానీ పెట్టిన 350 కోట్ల బడ్జెట్ కి, సినిమా కి ఉన్న హైప్ కి న్యాయం చేసే విధంగా లేదు… ఓవరాల్ గా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారు, భారీ గ్రాండియర్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా ఎక్కువగా నచ్చుతుంది. మిగిలిన ఆడియన్స్ ఒకసారి చూసే విధంగా సినిమా ఉంది.
సినిమా కి ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… బాలీవుడ్ లో యాక్షన్ మూవీస్ ఎక్కువ చూస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ వర్కౌట్ అవుతుంది కానీ ఈ లౌడ్ యాక్షన్ సీన్స్ ఇక్కడ మాస్ ఆడియన్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి…