T2B Live

Box office India - Tollywood - Bollywood - Box Office Reports

తమిళ్ వర్షన్ సాహో థియేటర్స్ కౌంట్…ఆల్ టైం హిస్టారికల్ రికార్డ్!!



     తెలుగు రాష్ట్రలతో పోల్చితే పక్క రాష్ట్రం తమిళనాడు లో థియేటర్స్ కౌంట్ తక్కువగానే ఉంటుంది, ఇక అక్కడ లోకల్ సినిమాల కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇతర భాషల సినిమాలకు ఎక్కువ థియేటర్స్ దొరికే అవకాశం చాలా తక్కువ, బాహుబలి కి అల్టిమేట్ క్రేజ్ అండ్ ఆ సినిమా తమిళ్ లో కూడా తెరకేక్కడం తో అక్కడ భారీ థియేటర్స్ ఆ సినిమా కి దొరికాయి. కానీ ఇప్పుడు తమిళ్ లో….

డబ్ వర్షన్ తోనే రిలీజ్ కాబోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ సాహో సినిమా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి హైయెస్ట్ థియేటర్స్ లో అక్కడ రిలీజ్ కాబోతున్న తెలుగు డబ్ మూవీ గా ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది. అక్కడ ఇది వరకు…

బాహుబలి పార్ట్ 1 380 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా, మహేష్ స్పైడర్ సుమారు 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది, బాహుబలి పార్ట్ 2 సినిమా అక్కడ 525 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సాహో ఇప్పుడు…

అక్కడ 550 కి పైగా థియేటర్స్ లో సుమారు 700 వరకు స్క్రీన్స్ లో తమిళనాడు లో రిలీజ్ కాబోతుంది, ఇది తెలుగు సినిమాల పరంగా ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి. ఈ రేంజ్ లో రిలీజ్ అవుతున్న సాహో క్రేజ్ పరంగా దుమ్ము లేపుతున్నా అక్కడ సినిమా…

ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది అందరిలోనూ ఆసక్తి ని రేపుతుంది అని చెప్పాలి. బాహుబలి సిరీస్, రాజమౌళి మూవీస్ తప్పితే అక్కడ భారీ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు లేనే లేవు, ప్రభాస్ సాహో ఆ అపవాదు ని చెరిపేసి భారీ వసూళ్ళ ని అక్కడ సాధిస్తుందో లేదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Related Articles

Post A Comment

avatar

SHARE THIS ARTICLE

Facebook
Twitter

SEARCH THIS SITE

SHARE THIS ARTICLE