Home న్యూస్ స్పైడర్ ని క్రాస్ చేయని సాహో…తమిళ్ డే 1 కలెక్షన్స్!

స్పైడర్ ని క్రాస్ చేయని సాహో…తమిళ్ డే 1 కలెక్షన్స్!

739
0

     బాహుబలి తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో పై అంచనాలు పీక్స్ లో ఉండగా అన్ని చోట్లా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో ఓపెన్ అయిన ఈ సినిమా పై ఎందుకనో ముందు నుండి తమిళ్ లో అనుకున్న లెవల్ లో బజ్ లేదు. భారీ లెవల్ లో రిలీజ్ అయితే చేశారు కానీ….

రిలీజ్ రోజు టాక్ ని భారీ ఎత్తున పూర్తి నెగటివ్ గా అక్కడ టాప్ వెబ్ సైట్స్ లో అలాగే సోషల్ మీడియా లో స్ప్రెడ్ చేశారు, అసలే నాన్ లోకల్ అన్న ఫీలింగ్ డానికి తోడూ నెగటివ్ టాక్… దాంతో మొదటి రోజు కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగానే పడింది.

బాహుబలి ని ఎంత ఓన్ చేసుకున్నా సాహో ని మాత్రం అలా ఓన్ చేసుకోలేదు, దాంతో మొదటి రోజు తమిళ్ లో 550 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయినా కేవలం 3.63 కోట్ల గ్రాస్ ని మాత్రమె సినిమా అక్కడ సాధించగలిగింది, అది రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన మహేష్ స్పైడర్ కన్నా తక్కువ అవ్వడం షాకింగ్.

మహేష్ మురగదాస్ ల కాంబో లో వచ్చిన స్పైడర్ తెలుగు తమిళ్ లో రూపొందగా తమిళ్ లో సినిమా 4.06 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసింది. ఆ సినిమా తో ఈ సినిమా ని కంపేర్ చేయడం తప్పే కానీ బాహుబలి తో అక్కడ ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాసిన తర్వాత సినిమా కి…

ఇలాంటి ఓపెనింగ్స్ ఒకింత షాక్ ని కలగజేయడం ఖాయమని చెప్పొచ్చు. కేరళలో కూడా 1.2 కోట్ల గ్రాస్ తో నే సినిమా సరిపెట్టింది. మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్స్ విషయం అనుకున్నట్లే తమిళ్ అండ్ కేరళ కలెక్షన్స్ హ్యాండ్ ఇచ్చాయి అని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here