Home న్యూస్ సాహో ట్రైలర్ రివ్యూ…500 కోట్ల బొమ్మ!!

సాహో ట్రైలర్ రివ్యూ…500 కోట్ల బొమ్మ!!

373
0

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాహుబలి తర్వాత ఏకంగా 2 ఏళ్ళకి పైగా టైం తీసుకుని చేసిన సినిమా సాహో, ఎట్టకేలకు అనేక అంచనాల నడుమ సినిమా థియేట్రికల్ ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, రావడమే కాదు సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ ట్రిబుల్ చేసింది అని చెప్పొచ్చు. హాలివుడ్ రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా మిషిన్ ఇంపాజిబుల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేంజ్ విజువల్స్ తో దుమ్ము లేపింది.

బ్యాగ్రౌన్స్ స్కోర్, ప్రభాస్ మాచో లుక్స్ కుమ్మేశాయి అని చెప్పాలి, 2000 కోట్ల క్రైం ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళే అండర్ కవర్ పోలిస్ లా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా విజువల్స్ అండ్ టేకింగ్ చూసి యావరేజ్ టాక్ తెచ్చుకున్న అన్ని భాషల్లో కలిపి అవలీలగా 500 కోట్లు మినిమం వసూల్ చేసే సత్తా ఉన్న సినిమా అంటున్నారు అందరూ.

ఇటివలే రిలీజ్ అయిన పాటల డబ్బింగ్ తెలుగు లో పెద్దగా సూట్ కాకపోవడం తో కొంచం నెగిటివిటీ వచ్చినా ట్రైలర్ అవన్నీ మర్చిపోయేలా చేసి ఆగస్ట్ 30 కోసం ఆశగా ఎదురు చూసేలా చేసింది, ఇక సినిమా కూడా ట్రైలర్ చూపెట్టినంత రేంజ్ లోనే ఉంటే బాక్స్ అఫీస్ దగ్గర రెబల్ స్టార్ భీభత్సం పక్కా అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here