బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన అన్ని సినిమాలు హిట్ గీతని దాటాలని రూల్ ఏమి లేదు కానీ పర్వాలేదు డీసెంట్ మూవీ అనిపించే రేంజ్ రెస్పాన్స్ వచ్చిన సినిమాలు కొన్ని ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో మాత్రం విఫలం అవుతున్నాయి…అలాంటి సినిమాల్లో…ఆది పినిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ శబ్దం(Sabdham Movie) కూడా ఒకటి…
సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వైశాలి కాంబోలో వచ్చిన మూవీ అవ్వడంతో కొంచం బజ్ అయితే క్రియేట్ చేసుకుంది. డీసెంట్ బిజినెస్ కూడా జరిగింది…సినిమా ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను చూసిన ఆడియన్స్ కి ఇవ్వడంతో…
పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా జోరు చూపించలేదు. తెలుగు లో 2.20 కోట్ల వాల్యూ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 1.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని 90 లక్షల లాస్ ను అందుకుంది.
ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Sabdham Movie Total World Wide Collections Approx
👉Telugu States – 2.65Cr
👉Tamilnadu – 2.85Cr
👉Ka+ROI – 0.60Cr
👉Overseas – 1.55Cr***approx
Total WW collection – 7.65CR(3.75CR~ Share) Approx
ఓవరాల్ గా సినిమా తెలుగు తమిళ్ కలిపి వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 10 కోట్ల రేంజ్ లో అయినా షేర్ ని అందుకోవాల్సిన అవసరంతో బరిలోకి దిగగా అందులో సగం కూడా రికవరీ చేయలేక బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా రన్ ను కంప్లీట్ చేసుకుంది.