నేపోటిజం ఎఫెక్ట్ వలన ఏకంగా వరల్డ్ రికార్డ్ డిస్ లైక్స్ ని సొంతం చేసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆలియా భట్ నటించిన సడక్ 2 సినిమా ను లేటెస్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు, డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ లో టెలికాస్ట్ అయిన సినిమా అంచనాలను అందుకుందా లేదా మొదటి పార్ట్ క్లాసిక్ రేంజ్ ని రెండో పార్ట్ టచ్ అయినా చేసిందా అన్న విషయాలు తెలుసుకుందాం పదండీ..
కథ విషయానికి వస్తే సంజయ్ దత్ టాక్సీ డ్రైవర్, తన భార్య చనిపోవడంతో భాదలో ఉన్న టైం లో ఆలియా భట్ క్యాబ్ ని బుక్ చేసుకోగా మొదట్లో రాను అన్నా తర్వాత తన గమ్యానికి చేరవేయడానికి ఒప్పుకుంటాడు సంజయ్ దత్…. తన తండ్రి దొంగ బాబాని నమ్ముతూ ఉండటంతో…
తండ్రి పై దొంగ బాబా పై పోరాటం చేస్తుంది ఆలియా… మరి సంజయ్ దత్ ఆలియా కి తన లవర్ ఆదిత్యా రాయ్ కపూర్ కి ఎలా అండగా నిలబడ్డాడు అన్నది ఓవరాల్ గా సినిమా కథ. చాలా సింపుల్ కథని ఏమాత్రం ఆసక్తి కలిగించకుండా….
2 గంటల 16 నిమిషాల లెంత్ తో బోర్ కొట్టించారు యూనిట్ అందరూ.. తర్వాత సీన్ ఎం జరుగుతుంది అన్నది ఈజీగా చెప్పే విధంగా ఒక్క ఆదిత్య రాయ్ కపూర్ ట్విస్ట్ తప్పితే ఏది కూడా కొంచం ఆసక్తి కలిగించకుండా చేసిన సడక్ 2 చాలా నీరసంగా సాగిన సినిమా అని చెప్పాలి…
ఉన్నంతలో సంజయ్ దత్ సినిమా కి తన తరుపున ఎంత చేయాలో అంత చేశాడు, ఆలియా భట్ కూడా ఉన్నంతలో మెప్పించాగా ఆదిత్య రాయ్ కపూర్ ఓకే అనిపించుకున్నాడు, మిగిలిన నటీనటులు ఎదో నటించాం అంటే నటించాం అనిపించుకున్నారు.
సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ స్క్రీన్ ప్లే చాలా నిరసనగా మారాయి, సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికే చాలా టైం పట్టింది… సెకెండ్ ఆఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ తప్పితే పూర్తిగా సినిమా గాడి తప్పింది అని చెప్పాలి. ఇక డైరెక్షన్ పరంగా మహేష్ భట్ చాలా టైం కి…
డైరెక్ట్ చేసినా ఏమాత్రం మెప్పించలేక పోయాడు. మొదటి పార్ట్ క్లాసిక్ గా నిలిస్తే ఈ రెండో పార్ట్ క్లాస్ మూవీ అనిపించుకోలేక పోయింది. మొత్తం మీద ఒకటి రెండు సాంగ్స్ కొన్ని సీన్స్ కోసం ఒకసారి కష్టంగా చూడొచ్చు… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్…