బాలీవుడ్ మొత్తం ఇప్పుడు భయంలో ఉంది, అసలే సుశాంత్ కేసు మీద కామెంట్స్ చేయడం లేదని ఫ్యాన్స్ తీవ్ర కోపం లో ఉండగా కామెంట్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది చేయక పొతే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అన్న అనుమానాలతో చాలా మంది చేయకుండానే ఉంటూ మరింత విమర్శలకు గురి అవుతున్నారు. ఇక సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ చేయలేని పరిస్థితి ఉండగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసుకుందామని ట్రై చేస్తున్నారు.
కానీ సుశాంత్ ఫ్యాన్స్ నెపో కిడ్స్ సినిమాలను టార్గెట్ చేస్తూ రిలీజ్ చేసిన సినిమాలను బాయ్ కాట్ చేస్తామని బెదిరిస్తున్నారు. రీసెంట్ గా ఈ ఎఫెక్ట్ గుంజన్ సక్సేనా పై ప్రభావం చూపిగా ఆ సినిమా నిర్మాత పేరు ను సినిమా నుండి తొలగించి నెట్ ఫ్లిక్స్ కొంచం డామేజ్ కవర్ చేసింది.
కానీ అసలు సిసలు ఎఫెక్ట్ ఆలియా భట్, సంజయ్ దత్ ఆదిత్య రాయ్ కపూర్ ల కాంబినేషన్ లో మహేష్ భట్ తెరకెక్కించిన సడక్ 2 సినిమా పై పడింది. ఈ సినిమా త్వరలోనే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానుండగా సినిమా ట్రైలర్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు.
సుశాంత్ ఫ్యాన్ ఆగ్రహాన్ని పీక్స్ కి తీసుకెళ్ళిన ఈ ట్రైలర్ కి డిస్ లైక్స్ ఓ రేంజ్ కి మించి ఎక్స్ ట్రీమ్స్ కి వెళ్ళిపోయింది. ట్రైలర్ ఓపెన్ చేయడం డిఫెరెంట్ అకౌంట్స్ తో డిస్ లైక్స్ కొడుతూ పోయారు. దాంతో వరల్డ్ లోనే హైయెస్ట్ డిస్ లైక్స్ సొంతం చేసుకున్న ట్రైలర్ గా నిలిచిన ఈ ట్రైలర్ ఇప్పుడు వరల్డ్ లోనే…
యూట్యూబ్ లో రిలీజ్ అయిన అన్ని వీడియోలలో మోస్ట్ డిస్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ 2 వీడియోగా నిలిచింది. ఆల్ మోస్ట్ 11.8 మిలియన్స్ కి పైగా డిస్ లైక్స్ ని అందుకున్న ఈ ట్రైలర్ కి ఇప్పటికీ భారీ లెవల్ లో డిస్ లైక్స్ వస్తూనే ఉండటంతో తమ సినిమాలు రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అని టోటల్ బాలీవుడ్ ఇప్పుడు షాక్ లో ఉందని సమాచారం…