ఒకరితో అనుకున్న సినిమాలు మరొకరితో తెరకెక్కించడం అన్నది సర్వ సాధారనంగా జరుగుతూ వస్తున్నదే. కథలు నచ్చకనో, డేట్స్ లేకనో లేక మరే ఇతర కారణాల వల్ల కానీ ముందు అనుకున్న వాళ్ళ ప్లేస్ తో తర్వాత వేరొకరు వస్తూ ఉంటారు. లేటెస్ట్ గా ఇలాంటిదే మరో సినిమా తెరకెక్కబోతుంది. ముందు మాస్ మహారాజ్ రవితేజ తో అనుకున్న సినిమా కాస్త ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి వెళ్ళింది అంటున్నారు.
వివరాల్లోకి వెళితే ఠాగూర్ మధు నిర్మాతగా రవితేజ హీరోగా ఓ కోర్ట్ నేపధ్యంలో సినిమా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ రవితేజ ఇతర సినిమాల కమిట్ మెంట్స్ వల్ల అలాగే పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేక పోవడం వలన చేయలేక పోయాడు అన్నది న్యూస్.
తర్వాత అదే కథ ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ దగ్గరకు వెళ్ళగా తర్వాత చిరు దగ్గరకు కూడా వెళ్ళింది. ఆ కథ నచ్చడం అలాంటి సినిమా ను రామ్ చరణ్ తో చేయించాలి అనుకున్నా అది కుదరకపోవడం తో సాయి ధరం తేజ్ తో అయినా చేయించాలి అనుకున్న చిరు…
కథ కి కొన్ని మార్పులు చేర్పులు చెప్పగా అవి చేసుకొచ్చిన కొత్త డైరెక్టర్ నరేషన్ నచ్చిన సాయి ధరం తేజ్ ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తర్వాత చేస్తున్నాడు. ఆ సినిమానే “భగవద్గీత సాక్షిగా” అంటున్నారు. రవితేజ దగ్గరకి వెళ్ళినప్పుడు కేవలం కోర్ట్ నేపధ్యంలోనే ఉన్న కథ పాయింట్ ఇప్పుడు కొన్ని కమర్షియల్ హంగులను యాక్షన్ సీన్స్ ని….
కథలో అమర్చి సాయి ధరం తేజ్ తో చేస్తున్నారు… రెండు వరుస హిట్లతో ఉన్న సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తో మళ్ళీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. అందుకే ఈ కోర్ట్ బెస్ట్ మూవీ తో రిస్క్ చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అదే సముయంలో ఆల్ రెడీ ఫ్లాఫ్స్ లో ఉండటం తో రవితేజ మళ్ళీ రిస్క్ ఎందుకని లైట్ తీసుకున్నారట…