ఒక సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ వేయడం అన్నది సినిమాల పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటారు, వచ్చిన షేర్ మీద 5-10% వరకు అటూ ఇటూగా వేయడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది… అన్ని ట్రాకింగ్ వెబ్ సైట్స్ కూడా 100% రియల్ కలెక్షన్స్ ఇస్తాయని రూల్ ఏమి లేదు….
కానీ కొంచం అటూ ఇటూగా 5-10% రేంజ్ లో డిఫెరెన్స్ ఉంటుంది, కానీ కొన్ని సినిమాల పరంగా ఏరియాల వారిగా ట్రాకర్స్ వేసెన కలెక్షన్స్ కన్నా కూడా అప్పుడప్పుడు నిర్మాతలు వేసే లెక్కలు ఎవ్వరికీ అంతు పట్టవు, భారీ గా పెంచేసి పబ్లిసిటీ కోసం పోస్టర్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు….
రీసెంట్ టైంలో భగవంత్ కేసరి మొదటి రోజుల్లో వచ్చిన లెక్క కన్నా మేకర్స్ ఎక్కువ కలెక్షన్స్ పోస్టర్ లను రిలీజ్ చేసి అందరూ దానిపై కామెంట్ చేయడంతో తర్వాత తప్పును సరిదిద్దుకుని కలెక్షన్స్ ని రిలీజ్ చేశారు. అంతకన్నా ముందు కూడా ఇలాంటివి చాలా సినిమాలా విషయంలో జరగగా ఇప్పుడు లేటెస్ట్ గా…
ఈ ట్రెండ్ పాన్ ఇండియా మూవీస్ కి కూడా పాకింది, సాధరణంగా పాన్ ఇండియా మూవీస్ కి వచ్చిన కలెక్షన్స్ ని పోస్టర్స్ లో వేస్తారు కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) విషయంలో మేకర్స్ వచ్చిన లెక్కకి మించి కలెక్షన్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేయడం అందరి చేత ట్రోల్ అయ్యేలా చేస్తుంది…
చాలా వరకు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్స్ రిపోర్ట్ లు వచ్చేస్తాయి, సలార్ విషయంలో కూడా రోజు వారి రిపోర్ట్ లు వస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో GST రిటర్న్స్ తో కలిపి సినిమా 93 కోట్లకు పైగా షేర్ ని 3 రోజుల్లో అందుకుంది… గ్రాస్ 140 కోట్ల దాకా ఉంటుంది…
ఇక హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో అక్కడ ట్రాకర్స్ క్లియర్ గా 65.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఉందని రిపోర్ట్ చేశారు, తమిళ్ లో అక్కడ ట్రాకర్స్ లెక్కలు 13 కోట్ల దాకా ఉండగా కేరళలో 9.50 కోట్లు, కర్ణాటకలో 24 కోట్లు ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 9.3 మిలియన్ డాలర్స్ అంటే 78 కోట్ల దాకా గ్రాస్ క్లియర్ గా రిపోర్ట్ అయింది… అంటే టోటల్ గా 3 రోజుల్లో సినిమా….
GST రిటర్న్స్ తో కలిపి 330 కోట్ల దాకా కొందరు GST రిటర్న్స్ తీసేసి 310-320 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ని రిపోర్ట్ చేశారు…. కానీ మేకర్స్ మాత్రం ఏకంగా 3 రోజుల్లో 402 కోట్ల రేంజ్ లో పోస్టర్ ను రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో ఈ కలెక్షన్స్ చూసి పాన్ ఇండియా మూవీకి ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ చెప్పడం తప్పు అంటూ ట్రోల్ చేస్తున్నారు…
ఇతర హీరోల ఫ్యాన్స్ కి కూడా ఇది మంచి సాకుగా మారగా వాళ్ళు కూడా ఓ రేంజ్ లో ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉండటంతో వచ్చిన కలెక్షన్స్ కి కొంచం అటూ ఇటూగా వేయడం ఓకే కానీ మరీ 70-80 కోట్ల రేంజ్ లో డిఫెరెన్స్ వస్తూ ఉండటంతో ఇవి ఫేక్ అంటూ క్లియర్ గా తెలిసిపోతుంది అందరికీ…ఎండ్ ఆఫ్ ది డే ఇది హీరోకే చెడ్డపేరు తెస్తుందని చెప్పొచ్చు.