పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) తెలుగు రాష్ట్రాల్లో రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఉండగా సినిమా హిందీలో కూడా సాలిడ్ కలెక్షన్స్ తో కుమ్మేయడం ఖాయమని అంతా అనుకున్నారు, కానీ అక్కడ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan)…
నటించిన డంకి(Dunki Movie) వలన థియేటర్స్ ఏమాత్రం అనుకున్న విధంగా ఇవ్వలేదు, ప్రతీ 100 థియేటర్స్ లో 65 డంకికి వెళితే 35 సలార్ కి వెళ్ళాయి. దాంతో కలెక్షన్స్ పై ఇంపాక్ట్ గట్టిగానే పడింది. ఉన్నంతలో సినిమా మొదటి రోజు 15.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రెండో రోజు 16 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ను…
మూడో రోజు ఇప్పుడు 20-21 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ 3 రోజుల్లో అక్కడ 52 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది, కనీసం 50% థియేటర్స్ ని ఇచ్చినా కూడా ఈ పాటికి 72-75 కోట్ల దాకా సినిమా వసూళ్ళని అందుకుని ఉండేది…. అక్కడ అగ్రిమెంట్స్ న్యూ ఇయర్ వరకు ఉండటంతో…
సలార్ కి చాలా లిమిటెడ్ గానే స్క్రీన్స్ అండ్ షోలు పెరుగుతున్నాయి. డంకికి టాక్ ఎలా ఉన్నా క్రేజీ కాంబో అలాగే క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ హెల్ప్ తో కలెక్షన్స్ పర్వాలేదు అనిపించేలా సొంతం చేసుకుంటూ ఉండగా సలార్ కి మాత్రం క్లాష్ వలన అక్కడ కలెక్షన్స్ కి…
దెబ్బ అయితే పడింది అని చెప్పాలి. అయినా కానీ ఉన్న 35% థియేటర్స్ లోనే సినిమా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ ఉండగా క్రిస్టమస్ నుండి న్యూ ఇయర్ వరకు ఇదే జోరుని సినిమా కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది, మరి లాంగ్ రన్ లో ఎంతవరకు వసూళ్ళని సినిమా అందుకుంటుందో చూడాలి.