పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar) మూవీ నుండి రీసెంట్ గా రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మొదటి ట్రైలర్ కన్నా కూడా సూపర్బ్ గా మెప్పించగా ప్రభాస్ యాక్షన్ మోడ్ లో అదరగొట్టేశాడు. ఔట్ అండ్ ఔట్ మాస్ ట్రైలర్ గా వచ్చిన ట్రైలర్ 2…
సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలను అమాంతం పెంచేసేలా మెప్పించింది అని చెప్పాలి. ఆ రెస్పాన్స్ 24 గంటల రిపోర్ట్ విషయంలో కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు. 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ ట్రైలర్ కి మొత్తం మీద యూట్యూబ్ లో తెలుగు లో 21.70 మిలియన్స్ వ్యూస్ సొంతం అయ్యాయి…
ఆల్ మోస్ట్ పెద్ద సినిమాల మెయిన్ ట్రైలర్స్ కి వచ్చే రేంజ్ రెస్పాన్స్ ఇదని చెప్పాలి. ఇక ట్రైలర్ కి 24 గంటల్లో 729K లైక్స్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఓవరాల్ గా ట్రైలర్ అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మొదటి ట్రైలర్ కి ఏమాత్రం తీసినిపోని విధంగా వ్యూస్ అండ్ లైక్స్ తో మాస్ జాతర చేశారు ఫ్యాన్స్… సినిమా మీద మళ్ళీ టీసర్ రిలీజ్ టైం నాటి అంచనాలు ఏర్పడగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏమాత్రం బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు.