Home న్యూస్ 40 కోట్ల సినిమా…టాక్ ఏంటి…..2 రోజుల్లో వచ్చింది ఇది!!

40 కోట్ల సినిమా…టాక్ ఏంటి…..2 రోజుల్లో వచ్చింది ఇది!!

1525
0

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుండి ఫ్యాన్స్ కోరుకునేది పక్కా యాక్షన్ అండ్ కంటెంట్ ఉన్న మూవీ… ఈ మధ్య కాలం లో అన్నీ యాక్షన్ మూవీస్ నే చేసినా అది ఆడియన్స్ ను అలరించే రేంజ్ లో అయితే ఉండటం లేదు. ఇలాంటి టైం లో తను ముఖ్య పాత్ర కాకున్నా తన సోదరి అర్పిత భర్త ఆయుష్ శర్మ విలన్ గా పరిచయం చేస్తూ తన పాత్రని హీరోగా మలిచి చేస్తున్న కొత్త సినిమా అంతిం…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పై అంచనాలు ఏర్పడటానికి కారణం సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎక్స్ టెండెడ్ క్యామియో ఈ సినిమాలో చేయగా సినిమా పై మంచి హైప్ ఏర్పడింది.. 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ కాకుండా…

తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాగా నిజాయితీగా ఉండే సిక్కు పోలిస్ గా సల్మాన్… టపోరీ విలన్ గా హీరో నటించాడు, హీరో ని మార్చడానికి సల్మాన్ ఖాన్ ఏం చేశాడు అసలు మారాడా లేదా ఇద్దరిలో ఎవరు గెలిచారు అన్న కథనే అంతిం సినిమా…

స్టొరీ యావరేజ్ గానే ఉన్నప్పటికీ యాక్షన్ సీన్స్ అదిరిపోవడం సల్మాన్ ఖాన్ నుండి కోరుకునే యాక్షన్ సీన్స్ సినిమాలో ఉండటంతో అవి ఆకట్టుకున్నా కథ పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో కొంచం రెస్పాన్స్ అక్కడ కూడా మిక్సుడ్ గానే ఉంది ఈ సినిమా విషయంలో… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు 4.85 కోట్ల కలెక్షన్స్ ని అందుకోగా…

రెండో రోజు ఆల్ మోస్ట్ 6 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకుందని అంటున్నారు. సల్మాన్ స్పెషల్ రోల్ కి మంచి రెస్పాన్స్ వస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మాస్ ని బాగానే ఆకట్టుకునే అవకాశం ఉందని చెబుతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న రేంజ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ని చూపెడుతుంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here