Home గాసిప్స్ డిసాస్టర్ సినిమాకి సీక్వెల్ అంట…మళ్ళీ షాకిచ్చిన సల్మాన్ ఖాన్!

డిసాస్టర్ సినిమాకి సీక్వెల్ అంట…మళ్ళీ షాకిచ్చిన సల్మాన్ ఖాన్!

0

ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ అంటే రీమేక్ లు, కమర్షియల్ మూవీస్ తో పాటు ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కుప్పలు తెప్పలుగా వచ్చేవి, కానీ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ అంటే రీమేక్ వుడ్ గా పేరు పోయింది, ఇలా పేరు వస్తున్నా కానీ బాలీవుడ్ వాళ్ళు రీమేక్ లను వదలడం లేదు, ఒకవేళ రీమేక్ ల మీద అప్పటికీ విమర్శలు వస్తే… ఆల్ రెడీ చేసిన సినిమాల్లో ఒక సినిమా ను ఎంచుకుని…

ఆ సినిమా కి సీక్వెల్ ని చేయడం అన్నది కూడా కామన్ అయింది, మొత్తం మీద ఫ్లాఫ్స్ పడినప్పుడు అయితే రీమేక్ లేదా సీక్వెల్ చేయడం లాంటివి బాలీవుడ్ లో ఈ మధ్య కామన్ అవ్వగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ విషయం లో…

మిగిలిన హీరోల కన్నా కూడా ముందు నిలుస్తూ వస్తున్నాడు ఈ మధ్య, ఎక్కువగా సీక్వెల్ లేదా రీమేక్ లను నమ్ముకుంటూ వెళుతున్న సల్మాన్ హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు మినిమమ్ కొడుతున్నాడు అన్న కాన్ఫిడెంట్ లో ఈ మధ్య వరుసగా సీక్వెల్స్ అండ్ రీమేక్ లు చేసి…

వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకోగా కొత్త కథలు ట్రై చేయకుండా ఇప్పుడు మరో 2 రీమేక్ లను కన్ఫాం చేయగా ఇప్పుడు మరో 2 సీక్వెల్స్ ని కూడా కన్ఫాం చేశాడు. ఏక్ థా టైగర్ సిరీస్ లో టైగర్ జిందా హై తర్వాత ఇప్పుడు మరో సీక్వెల్ చేస్తుండగా ఈ సిరీస్ కాకుండా సల్మాన్ ఖాన్ ఆల్ రెడీ చేసిన సీక్వెల్ రేస్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర…

భారీ డిసాస్టర్ అయినా టాక్ ని తెచ్చుకోగా ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్ కి రేస్ 4 ని మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడని బాలీవుడ్ లేటెస్ట్ టాక్. ఈ సినిమాను వచ్చే ఇయర్ ఆడియన్స్ ముందుకు తేవాలని అనుకుంటున్నాడట. మాస్టర్, ఖిలాడీ రీమేక్ లతో ఈ డిసాస్టర్ సీక్వెల్ ని అప్ కమింగ్ మూవీస్ లో పెట్టి మరోసారి షాకిచ్చాడు సల్మాన్, మరి వీటితో అయినా హిట్స్ ని అందుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here