బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి ఆల్ ఇండియా లెవల్ లో క్రేజ్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే, కెరీర్ లో ఆల్ టైం డౌన్ ఫాల్ లో ఉన్న సమయం లో పోకిరి రీమేక్ వాంటెడ్ తో కంబ్యాక్ ఇచ్చినా కానీ అసలు సిసలు బ్లాక్ బస్టర్ దబంగ్ తో సాధించాడు సల్మాన్ ఖాన్, ఆ సినిమా వచ్చి 10 ఏళ్ళు పూర్తీ అవ్వగా ఈ 10 ఏళ్ల కెరీర్ తన లైఫ్ లోనే…
ఆల్ టైం పీక్ స్టేజ్ అనే చెప్పాలి, అంతలా పోటి లేకుండా బాలీవుడ్ ని ఏలిన సల్మాన్ అదే దబంగ్ సిరీస్ లో చేసిన లేటెస్ట్ మూవీ దబంగ్ 3 లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది, రెండో పార్ట్ మొదటి సినిమా క్రేజ్ పుణ్యామా అని సూపర్ హిట్ అవ్వగా…
మూడో పార్ట్ మాత్రం పర్వాలేదు అనిపించే టాక్ ని సాధించినా కానీ ఆడియన్స్ మెప్పును కంప్లీట్ గా సొంతం చేసుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయింది, కేవలం 146 కోట్ల రేంజ్ కలెక్షన్స్ కే పరిమితం అయిన ఈ సినిమా ఇతర సౌత్ భాషల్లో కూడా డబ్ అవ్వగా…
ఫలితం ఇక్కడ కూడా డిసాస్టర్ అనిపించే లెవల్ లోనే రాగా సినిమాను తర్వాత జీ తెలుగు వాళ్ళు తెలుగు డబ్ వర్షన్ ని చాలా లేట్ గా రీసెంట్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ చేశారు, పెద్దగా సినిమాను టెలివిజన్ లో పట్టించు కోక పోవడం తో సినిమాకి TRP ఏమాత్రం బాగా రాలేదు అనే చెప్పాలి.
సినిమాను ఛానెల్ ఎంతకు కొన్నది అన్న క్లారిటీ లేదు కానీ సినిమా కి మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు మాత్రం 3.06 TRP రేటింగ్ దక్కింది. ఇది మరీ తీసి పారేసే రేటింగ్ అయితే కాదని చెప్పాలి, ఎలాంటి పబ్లిసిటీ లాంటిది లేకుండా సైలెంట్ గా టెలికాస్ట్ చేసినా సినిమా కి ఓకే అనిపించే రేటింగ్ దక్కింది, కొంచం ప్రమోషన్ ఎక్కువగా చేసి ఉంటె బెటర్ రేటింగ్ వచ్చి ఉండేది…