బాక్స్ ఆఫీస్ దగ్గర ఒరిజినల్ కథలు ఏమాత్రం వర్కౌట్ అవ్వక పొతే చాలు ఇక రీమేక్ లను చేయడానికి సిద్ధం అవుతున్నారు బాలీవుడ్ వాళ్ళు, దాదాపు అక్కడ రూపొందుతున్న అప్ కమింగ్ ప్రతి 10 సినిమాల్లో 6-7 సినిమాలు రీమేక్ లనే సెలెక్ట్ చేసుకుంటూ ఉండటం విచారకరం, ఇక సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అయితే ఇప్పుడు వరుస పెట్టి రీమేక్ లను హిందీ లో దింపడానికి సిద్ధం అవుతున్నాడు. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో…
వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న సల్మాన్ ఖాన్ రీసెంట్ గా రాధే డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తో కొద్దిగా సేఫ్ అయ్యాడు, కానీ సినిమాకి తీవ్ర విమర్శలు రాగా ఇప్పుడు హిందీ లో విజయ్ మాస్టర్ ను, తర్వాత రవితేజ ఖిలాడి రీమేక్ లను చేయబోతున్న సల్మాన్ ఖాన్…
రీసెంట్ గా మరో రీమేక్ ను కూడా చేయబోతున్నాడని సమాచారం… టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ ను అక్కడ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా హక్కులను కలిగి ఉన్న మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర…
సల్మాన్ ఖాన్ డేట్స్ కూడా అందుబాటులో ఉండటం తో ఒరిజినల్ కథ కాకుండా ఈ జనతా గ్యారేజ్ కథ ని సల్మాన్ కి చెప్పడం ఎన్టీఆర్ సినిమా అవ్వడం తో సల్మాన్ చూసి ఓకే చేయడం జరిగిందని ప్రస్తుతం వార్తలు శిఖారు చేస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే…
ఎన్టీఆర్ రోల్ కి సల్మాన్ ఎంతవరకు న్యాయం చేస్తాడు అలాగే ఇక్కడ సూపర్ స్టార్ మోహన్ లాల్ పోషించిన రోల్ ని హిందీ లో ఎవరితో చేయిస్తారు అనేది కూడా ఆసక్తి కరం, ఈ సినిమా తోనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బాలీవుడ్ లో అడుగు పెడతారని అంటున్నారు. వరుస రీమేక్ లను కన్ఫాం చేస్తున్న సల్మాన్ ఖాన్ తిరిగి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని చెప్పొచ్చు.