Home న్యూస్ సల్మాన్ రాధే…లెంత్ ఇంతేనే…కెరీర్ లోనే ఇదే మొట్ట మొదటి సారి!

సల్మాన్ రాధే…లెంత్ ఇంతేనే…కెరీర్ లోనే ఇదే మొట్ట మొదటి సారి!

1769
0

చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు స్క్రిప్ట్ డిమాండ్ చేసినా చేయక పోయినా కానీ భారీ లెంత్ తోనే తెరకేక్కుతూ ఉంటాయి. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు అన్నీ కూడా ఇదే రూట్ లోనే లెంత్ ఎక్కువగానే ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాల లెంత్ మాత్రం కొంచం తక్కువగా ఉంటుంది, అప్పుడెప్పుడో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మూవీ…

2 గంటల రేంజ్ లెంత్ తోనే తెరకెక్కింది, దాంతో అప్పట్లో సల్మాన్ ఖాన్ మూవీస్ లో అతి తక్కువ లెంత్ తో వచ్చిన సినిమాగా నిలిచింది, తర్వాత దబాంగ్ 2 కూడా అదే రేంజ్ లెంత్ తోనే రాగా మాగ్జిమం మూవీస్ అన్నీ కూడా 2 గంటల 20 నిమిషాలకు పైగానే…

లెంత్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాయి, కానీ మొట్ట మొదటి సారి తన కెరీర్ లోనే లోవేస్ట్ రన్ టైం ని ఇప్పుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ రాధే సొంతం చేసుకుందని సమాచారం. ప్రభుదేవా డైరెక్షన్ లో రూపొందుతున్న వాంటెడ్ మూవీ సీక్వెల్ అయిన రాధే మొత్తం మీద లెంత్ ఎంత అనేది…

రీసెంట్ గా సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకున్న నేపధ్యంలో రివీల్ చేశారు. కాగా ఓవరాల్ లెంత్ కేవలం 1 గంటా 54 నిమిషాల లోపు మాత్రమే ఉంటుందని అంటున్నారు. అందులో టైటిల్స్ ఎండ్ ఎండ్ టైటిల్స్ తీసేస్తే… మరో 2 నిముషాలు తక్కువ లెంత్ ఉంటుందని చెప్పొచ్చు. దాంతో ఈ సినిమా ఇప్పుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే అతి తక్కువ లెంత్ ఉన్న…

సినిమాగా మారింది అని చెప్పాలి. అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల పరంగా కూడా వన్ ఆఫ్ ది లోవేస్ట్ రన్ టైం ని కలిగిన సినిమాగా ఈ సినిమా నిలవబోతుంది అని చెప్పాలి. ఇక సినిమా 13 న ఇండియా లో తెరచి ఉన్న థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here