బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా వచ్చిన సినిమా సమ్మతమే కి పర్వాలేదు అనిపించే రేంజ్ టాక్ వినిపించినా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా వీకెండ్ తర్వాత కంప్లీట్ గా స్లో అయిపొయింది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా డౌన్ అవ్వగా రెండో వారంలో కొత్త సినిమాల పోటి వలన ఈ సినిమా థియేటర్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి, దాంతో సినిమా కలెక్షన్స్ పై ఆ ఇంపాక్ట్ మరింత పడగా…
ఆల్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తీ చేసుకోవడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృశ్యా అయితే నిరాశ పరిచింది అనే చెప్పాలి. దాంతో ఇక డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా ఆహా వీడియో లో…
ఈ నెల 15న డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి గాను ఆల్ మోస్ట్ 1 కోటి 60 లక్షల రేంజ్ లో రేటు చెల్లించి హక్కులను ఆహా వీడియో వాళ్ళు సొంతం చేసుకున్నారని ట్రేడ్ లో టాక్ ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా ఇక డిజిటల్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.