Home న్యూస్ తొర్బాజ్ రివ్యూ….ఉగ్రవాదం Vs క్రికెట్…కథ బాగుంది కానీ!

తొర్బాజ్ రివ్యూ….ఉగ్రవాదం Vs క్రికెట్…కథ బాగుంది కానీ!

741
0

బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ 2020 ఇయర్ లో నటించిన రెండో సినిమా తొర్బాజ్… సడక్ 2 సినిమా తో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంజయ్ దత్ ఆ సినిమాతో ఏమాత్రం మెప్పించలేక పోయాడు, ఇక ఇప్పుడు ఉగ్రవాదం Vs క్రికెట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తొర్బాజ్ సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే… చిన్న పిల్లలకు తీవ్రవాదం నేర్పి వాళ్ళని మానవ ఆయుధాలుగా మార్చి ఆఫ్గనిస్తాన్లో ఎలా వాళ్ళతో బాంబు దాడులు చేయిస్తారో అందరికీ తెలిసిందే, ఇదే పాయింట్ తో సినిమా తెరకెక్కగా వాటిని అరికట్టాలి అని భావించే సోషల్ వర్కర్ అయిన…. నర్గీస్ ఫక్రీ రిక్వెస్ట్ మేరకు…

ఇండియా నుండి అక్కడికి వస్తాడు హీరో సంజయ్ దత్, అక్కడ పిల్లలకి క్రికెట్ మీద ఉన్న ఆసక్తిని గమనించే వాళ్ళని ప్రోత్సహించే క్రమంలో విలన్ రాహుల్ దేవ్ ఎదురు పడతాడు, మరి హీరో విలన్ ని ఒప్పించి పిల్లలకి క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చాడా విలన్ ఒప్పుకున్నాడా లేదా లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలిసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా ఉన్నవి తక్కువ రోల్స్ అయినా అందరూ బాగానే నటించారు, ఇలాంటి రోల్స్ ఎన్నో చేసి ఉన్న సంజయ్ దత్ సింపుల్ గా తన రోల్ ని చేయగా విలన్ గా రాహుల్ దేవ్ కూడా మెప్పించాడు, ఇక నర్గీస్ ఫక్రి కి పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. మిగిలిన పాత్రలు కూడా బాగానే నటించాయి, పిల్లలు అందరూ మెప్పిస్తారు.

డైరెక్టర్ ఎంచుకున్న కథ మెయిన్ పాయింట్ బాగున్నప్పటికీ కూడా తెరకెక్కించిన విధానం నిరాశపరిచింది, అది లాజిక్ లు రియాలిటీ కి చాల దూరంగా తెరకెక్కుతుంది ఈ సినిమా… జీహాదీ టెర్రరిస్ట్ లు అసలు ఏమాత్రం కరగరు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ హీరో బ్రతిమిలాడి క్రికెట్ పోటి కి ఒప్పిస్తాడు.

ఇలా లాజిక్ లు వెతక్కుండా చూస్తె సినిమా పర్వాలేదు అనిపిస్తుంది కానీ మంచి పాయింగ్ ని ఇంకాస్త బాగా తీసి ఉంటె సినిమా మంచి ఔట్ పుట్ వచ్చే కాన్సెప్ట్ మూవీ గా చెప్పుకోవాలి, లోకేషన్స్, సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉన్నాయని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉండగా 2 గంటల పాటు డైరెక్టర్ సినిమాను…

అనుకున్న విధంగా తీయడంలో విఫలం అయ్యాడు, పార్టు పార్టులుగా కొన్ని సీన్స్ మెప్పించినా ఓవరాల్ గా 2 గంటల సినిమా మాత్రం సీన్ బై సీన్ మనం ఊహించినట్లు గానే జరుగుతూ క్లైమాక్స్ కి చేరుకుంటుంది, సినిమా కి ఎలాంటి ముగింపు ఇస్తారు అని అనుకుంటే అక్కడ మాత్రం కొంచం ట్విస్ట్ ఇచ్చి ఊహించని క్లైమాక్స్ తో…

ముగింపు ఇచ్చాడు డైరెక్టర్… సినిమాలో అప్ అండ్ డౌన్స్ చాలానే ఉన్నప్పటికీ క్రికెట్ నేపధ్యంలో సినిమాలు ఇష్టపడే వారికి సినిమా పర్వాలేదు అనిపిస్తుంది, దానికి ఉగ్రవాదం కూడా జోడించారు కాబట్టి కొంచం ఓపిక తో సినిమా చూస్తె పర్వాలేదు అనిపిస్తుంది, లాజిక్ లు వెతికితే నిరాశపరుస్తుంది. సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.25 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here