బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) లాంగ్ రన్ లో సాలిడ్ రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఓపెనింగ్ డే నుండే సినిమా..
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మిగిలిన సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేసి సంచలనం సృష్టించింది…సంక్రాంతికి రిలీజ్ కి ముందు వరకు మూడు సినిమాల్లో బిజినెస్ పరంగా రిలీజ్ పరంగా చిన్న సినిమాలా అనిపించినా కూడా తర్వాత సీన్ మొత్తం మారిపోయి…
మిగిలిన సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేస్తూ మాస్ ఊచకోత కోసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 5 రోజుల టైంకే బాలయ్య నటించిన డాకు మహారాజ్ కలెక్షన్స్ ని దాటేసింది. ఇక భారీ బిజినెస్ ను సొంతం చేసుకుని ఆ బిజినెస్ కి ఏమాత్రం న్యాయం చేయలేక పోయినా కూడా…
ఉన్నంతలో 100 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి ఆల్ మోస్ట్ 13 రోజుల్లో 197.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ ని కూడా ఇప్పుడు 9 రోజుల్లో బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ…
ఓవరాల్ గా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలను ఫుల్లుగా డామినేట్ కలెక్షన్స్ పరంగా కూడా ఇప్పుడు టాప్ లో దూసుకు పోతూ నంబర్ 1 గా నిలిచింది..9వ రోజు సాధించిన కలెక్షన్స్ తో గేమ్ చేంజర్ కలెక్షన్స్ ని దాటడంతో…
2025 ఇయర్ లో ఇప్పటికి రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో టాప్ గ్రాసర్ మూవీగా దూసుకు పోతుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా…సినిమా ఇదే ఊపు సెకెండ్ వీకెండ్ లో చూపించగలిగితే లాంగ్ రన్ లో ఈజీగానే 250 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.