బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో బిగ్ పాన్ ఇండియా మూవీస్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో హోల్డ్ ని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తుంది…
ఈ క్రమంలో సినిమా ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకున్న సినిమాల్లో ఒక్కో సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ని ఇప్పుడు బ్రేక్ చేస్తూ మాస్ భీభత్సం సృష్టిస్తూ ఉండటం విశేషం…ఓవరాల్ గా 8 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో 94.45 కోట్ల షేర్ ని అందుకోగా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేసిన గుంటూరు కారం హనుమాన్ సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ని ఆల్ రెడీ బీట్ చేసింది. ఇక 9వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగు వర్షన్ కి గాను…
2018 టైంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన రంగస్థలం సినిమా లైఫ్ టైం కలెక్షన్స్ ని బీట్ చేసింది…రంగస్థలం సినిమా లైఫ్ టైములో తెలుగు రాష్ట్రాల్లో 95.27 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని…
అవలీలగా 9 రోజులలో సాధించిన కలెక్షన్స్ తో బీట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉండగా తర్వాత టార్గెట్ సైరా నరసింహా రెడ్డి సినిమా 106.4 కోట్ల షేర్ ని అందుకుని ఉండగా…త్వరలో ఈ మార్క్ ని కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రాస్ చేసే…
అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా రంగస్థలం వరల్డ్ వైడ్ కలక్షన్స్ ని కూడా ఆల్ మోస్ట్ బీట్ చేసిందని చెప్పాలి. సంక్రాంతికి ఎపిక్ కలెక్షన్స్ రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.