Home న్యూస్ సప్తగిరి “పెళ్ళికాని ప్రసాద్” సినిమా టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!!

సప్తగిరి “పెళ్ళికాని ప్రసాద్” సినిమా టాక్ ఏంటి….హిట్టా-ఫట్టా!!!

0

టాలీవుడ్ లో కామెడీ రోల్స్ తో ఒక టైంలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నా కూడా హీరోగా అడపాదడపా ట్రై చేస్తూ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయిన సప్తగిరి(Sapthagiri) మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ అయిన పెళ్ళికాని ప్రసాద్(PelliKani Prasad Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో…

రిలీజ్ అవ్వగా సినిమా ట్రైలర్ ఆల్ రెడీ రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…

ఏళ్ళు గడుస్తున్నా కూడా పెళ్లి కాని హీరో 36 ఏళ్ళు అవుతున్నా పెళ్లి కాకుండానే ఉండగా తన తండ్రి 2 కోట్ల కట్నం ఇస్తేనే పెళ్లి అని కండీషన్ పెడతాడు. ఈ గ్యాప్ లో విదేశాలకు వెళ్ళాలని అనుకునే హీరోయిన్ ఫ్యామిలీతో హీరో పరిచయం అవ్వగా హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు…

ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టోరీ పరంగా చాలా బేసిక్ కథతో వచ్చిన పెళ్ళికాని ప్రసాద్ కామెడీ పరంగా అక్కడక్కడా బాగానే నవ్వించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ కానీ సెకెండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించేలా…

మెప్పించగా…ఓవరాల్ గా సినిమా అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వలేదు అనే చెప్పాలి. సప్తగిరి మరోసారి కామెడీ విషయంలో కొన్ని సీన్స్ లో తన ప్రభావం చూపించగా మిగిలిన పాత్రలు అన్నీ కూడా మరీ ఓవర్ ది టాప్ అనిపించేలా నటించారు…

సినిమా ఓవరాల్ స్క్రీన్ ప్లే నే ఓవర్ ది టాప్ అనిపించేలా ఉండగా, సెంటిమెంట్ సీన్స్ కానీ ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేదు, అవి బాగా చూపించి ఉంటే ఓవరాల్ గా సినిమా ఇంకొంచం బెటర్ గా ఉండేది…. ఓవరాల్ గా పెద్దగా అంచనాలు ఏమి పెట్టుకోకుండా…

అక్కడక్కడా నవ్వుకోవడానికి థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కొంచం ఓపికతో చూస్తె కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించేలా నవ్వించినా ఓవరాల్ గా సినిమా మొత్తం చూడాలి అంటే ఓపిక కొంచం ఎక్కువే అవసరం…ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here