తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న కోలివుడ్ హీరోలలో కార్తీ ముందు నిలిచే హీరో… ఖైదీ సూపర్ హిట్ తర్వాత రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ 1 తో ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు దీపావళి కి ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ సర్దార్ తో సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా కి పోటిగా భారీగానే సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో…
ఉన్నాయి అని చెప్పాలి. అయినా సినిమాను తెలుగులో చాలా ఏరియాలో ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా బిజినెస్ వాల్యూ రేంజ్ అటూ ఇటూగా 5 కోట్ల రేంజ్ రేటుని సొంతం చేసుకోగా ఏరియాల వారి బిజినెస్ లెక్క ఈ విధంగా ఉంది…
👉Nizam: 2.00Cr
👉Ceeded: 0.8Cr
👉Andhra: 2.20Cr
AP-TG Total:- 5.00CR(Break Even – 5.50Cr)
ఇదీ మొత్తం మీద సినిమా తెలుగు టోటల్ వాల్యూ బిజినెస్ లెక్క. సినిమా తెలుగు లో హిట్ అవ్వాలి అంటే 5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన బిజినెస్ లెక్కలను గమనిస్తే…
👉Tamilnadu – 28Cr
👉Telugu States- 5.00Cr
👉Karnataka- 1.50Cr
👉Kerala – 1.00Cr
👉ROI – 0.50Cr
👉Overseas – 4.50CR~(est)
Total WW Business – 40.50CR
ఇదీ సినిమా ట్రేడ్ లెక్కల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క…సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ అవ్వాలి అంటే…
మినిమమ్ 80 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, పోటిలో ఇతర సినిమాలు కూడా ఉన్న నేపధ్యంలో ఎంతవరకు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించి ఈ బిజినెస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందో చూడాలి ఇక…