బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) కెరీర్ లో 150వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ సర్ ఫిరా(Sarfira Movie Review Telugu) రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.. ఓటిటిలో సూపర్ హిట్ గా నిలిచిన ఆకాశం నీ హద్దు రా మూవీ కి రీమేక్ గా తెరకెక్కిన సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమాతో అక్షయ్ కుమార్ కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేశాడు…మరి సినిమా అంచనాలను అందుకుందా లేదా అంటే….
ఒరిజినల్ ను చాలా వరకు మ్యాచ్ చేసేలా ఉందని చెప్పాలి…కథ పాయింట్ కి వస్తే సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం చేయాలని భావించే హీరో చేసిన ప్రయత్నాలు ఏంటి…ఫేస్ చేసిన ఎదురుదెబ్బలు ఏంటి…ఇవన్నీ ఫేస్ చేసి హీరో ఎలా తాను అనుకున్నది సాధించాడు అన్నది ఓవరాల్ గా కథ పాయింట్ అని చెప్పాలి…
ఒరిజినల్ డైరెక్టరే మళ్ళీ డైరెక్ట్ చేయడంతో కథని ఆల్ మోస్ట్ సీన్ బై సీన్ ఒరిజినల్ నే దింపగా ఉన్నంతలో అక్షయ్ కుమార్ సూర్యని మరీ మరిపించే రేంజ్ లో కాకపోయినా కానీ చాలా వరకు బెటర్ గా హ్యాండిల్ చేసి మెప్పించాడు…మిగిలిన యాక్టర్స్ కూడా అందరూ ఆకట్టుకోగా…
ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చే అవకాశం ఉండగా, చూసిన ఆడియన్స్ కి మాత్రం పర్వాలేదు అనిపించేలా మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి. ఒరిజినల్ లో మెప్పించిన చాలా సీన్స్ సర్ ఫిరా లో కూడా సేమ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసేలానే మెప్పించాయి అని చెప్పాలి…
అక్కడక్కడా కథ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటికి వచ్చే అవకాశం ఉండగా ముందుగా చెప్పినట్లు ఒరిజినల్ వర్షన్ చూడని వాళ్ళకి సినిమా ఇంకా బెటర్ గా అనిపించే అవకాశం ఉండగా…
చూసిన ఆడియన్స్ కి ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు…మొత్తం మీద రీసెంట్ టైంలో అక్షయ్ కుమార్ నటించిన సినిమాలతో పోల్చితే మాత్రం చాలా బెటర్ గా అనిపించింది సర్ ఫిరా సినిమా… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో అక్షయ్ కుమార్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి ఇక…