Home గాసిప్స్ “సర్ ఫిరా” సినిమా డిసాస్టర్….నిర్మాతగా సూర్యకి లాభమా….నష్టమా!

“సర్ ఫిరా” సినిమా డిసాస్టర్….నిర్మాతగా సూర్యకి లాభమా….నష్టమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన లేటెస్ట్ మూవీ సర్ ఫిరా(Sarfira Movie Collections) ఆడియన్స్ ను మెప్పించే విషయంలో తీవ్రంగా నిరాశ పరిచింది….ఒరిజినల్ వర్షన్ ఓటిటిలో సూపర్ డూపర్ హిట్ అవ్వడం, పాండమిక్ టైంలో ఆ సినిమాను ఆడియన్స్ భారీగా డిజిటల్ లో చూడటంతో….

ఈ రీమేక్ మీద ముందు నుండే అనుమానాలు ఉండగా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ ఆల్ రెడీ చూసిన సినిమాకి మళ్ళీ భారీగా డబ్బులు ఖర్చు చేసి చూడటం వృధా అనుకుని ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక…

పట్టుమని 25 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవడానికే ఆపసోపాలు పడుతుంది ఇప్పుడు…కాగా సినిమా నిర్మించిన నిర్మాతల్లో ఒరిజినల్ వర్షన్ లో యాక్ట్ చేసిన సూర్య(Suriya) కూడా సినిమా నిర్మాణంలో పాలు పంచుకోగా ఓవరాల్ గా నిర్మాతలు అందరూ కలిసి సినిమాను…

సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించారు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకి 110 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయితే అయిందని సమాచారం. ఇక సినిమాకి మ్యూజిక్, శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ అన్నీ కలిపి రిలీజ్ కి ముందే ఆల్ మోస్ట్ 120 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగిందట….

దాంతో ఆల్ మోస్ట్ బడ్జెట్ మీదే ఇక్కడే మేకర్స్ కి 10 కోట్ల మేర టేబుల్ ప్రాఫిట్ సొంతం అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా భారీగా వర్కౌట్ అయితే లాభాలు ఇంకా పెరుగుతాయని ఆశించారు…. కానీ సినిమాను అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేయగా వరల్డ్ వైడ్ గా కేవలం 35 కోట్ల లోపే వసూళ్ళని…

సినిమా సొంతం చేసుకోవడం, ఇండియా లో 25 కోట్ల లోపే నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా వర్త్ షేర్ 12 కోట్ల లోపే ఉండే అవకాశం ఉంది…దాంతో మేకర్స్ కి మొత్తం మీద బడ్జెట్ మీద 20 కోట్ల కి అటూ ఇటూగా ప్రాఫిట్ ఉండే అవకాశం ఉండగా…నిర్మాతల్లో ఒకరైన సూర్యకి మరీ భారీ లెవల్ లో కాకపోయినా కొంత టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమాతో సొంతం అయ్యింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here