Home న్యూస్ ఏడాదిలో 980 కోట్లు కొట్టిన హీరో…150వ సినిమా…హిట్ టాక్ తో టోటల్ గా వచ్చింది ఇది!!

ఏడాదిలో 980 కోట్లు కొట్టిన హీరో…150వ సినిమా…హిట్ టాక్ తో టోటల్ గా వచ్చింది ఇది!!

0

ఓడలు బండ్లు…బండ్లు ఓడలు అవుతాయి అంటారు…ఒకప్పుడు అద్బుతమైన హిట్స్ కొట్టిన హీరోకి సైతం ఫ్లాఫ్స్ పడటం కామన్ కానీ, అవి మరీ ఎక్కువ అయిపోయి పూర్తిగా ఫామ్ కోల్పోయి కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమాతో అత్యంత తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఎవ్వరూ ఊహించని షాక్ అనే చెప్పాలి….

ప్రస్తుతం ఇలాంటిదే ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్(Akshay Kumar)…ప్రీ కోవిడ్ టైంలో 2019 ఇయర్ లో చేసిన సినిమాలు అన్నింటితో సూపర్ హిట్స్ ను అందుకుని ఆ ఒక్క ఇయర్ లోనే ఏకంగా 980 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న…

అక్షయ్ కుమార్ తర్వాత కోవిడ్ తర్వాత పూర్తిగా ఫామ్ కోల్పోగా వరుస పెట్టి ఫ్లాఫ్ మూవీస్ తో తన మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. ఇలాంటి టైంలో రీసెంట్ గా తన కెరీర్ లో 150వ సినిమాగా వచ్చిన డిజిటల్ సూపర్ హిట్ మూవీ ఆకాశం నీ హద్దురా మూవీ హిందీ రీమేక్…

సర్ ఫిరా మూవీగా రూపొందింది…ఆల్ మోస్ట్ 120 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను కూడా సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మాత్రం మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించలేక పోయింది. టోటల్ రన్ లో ఇండియాలో సినిమా కేవలం…

25 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ను అందుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది…ఓవర్సీస్ లో జస్ట్ హాల్ఫ్ మిలియన్ నే అందుకున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 34 కోట్ల గ్రాస్ నే సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ షేర్ లెక్క 15 కోట్ల రేంజ్ లోనే ఉంటుందని అంచనా…

దాంతో ఒకప్పుడు 980 కోట్లను ఒక్క ఏడాదిలో అందుకున్న హీరో నుండి కెరీర్ లో ప్రతిష్టాత్మక 150వ సినిమా అయిన సర్ ఫిరా మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ ను సొంతం చేసుకుని తీవ్రమైన నష్టాలను దక్కించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here