Home గాసిప్స్ 2 నిమిషాల్లో ఇండియా…4 నిమిషాల్లో వరల్డ్ వైడ్…4 లక్ష ట్వీట్స్ తో సూపర్ స్టార్ ఊచకోత!!

2 నిమిషాల్లో ఇండియా…4 నిమిషాల్లో వరల్డ్ వైడ్…4 లక్ష ట్వీట్స్ తో సూపర్ స్టార్ ఊచకోత!!

561
0

     సోషల్ మీడియా లో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు సంచలన రికార్డులతో దూసుకు పోతున్నారు. చాలా కాలం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కా కమర్షియల్ మాస్ మూవీ చేయడం తో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్ నిరూపిస్తుంది, సినిమా టీసర్ కి ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అన్ని చోట్లా వస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు…

టీసర్ లో ఉండటం వాళ్లకి ఫుల్ కిక్ ఇస్తుండగా మహేష్ కామిక్ టైమింగ్ చాలా కాలం తర్వాత చూడటం రిఫ్రెషింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఇక అఫీషియల్ టీసర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో సోషల్ మీడియా లో సంచలన ట్రెండ్ తో దూసుకు పోతుంది. సినిమా టీసర్…

రిలీజ్ చేసిన రెండున్నర నిమిషాల్లోనే ఇండియా లో టాప్ 3 ప్లేసు లో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టగా వరల్డ్ వైడ్ గా 4 నిమిషాల లోపు సమయం మాత్రమె తీసుకుని టాప్ 15 ప్లేసులో ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టింది సరి లేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీసర్.

ఇక టీసర్ రిలీజ్ అయిన గంట లోనే సోషల్ మీడియా లో 4 లక్షల కు పైగా ట్వీట్స్ పోల్ అయినట్లు సమాచారం. గంటలో ఇది సంచలన ట్రెండ్ అనే చెప్పాలి. ఇక యూట్యూబ్ లో రికార్డుల వేట మొదలు పెట్టిన ఈ టీసర్ ఓవరాల్ గా 24 గంటలు పూర్తీ అయ్యే సరికి ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతానికి సాహో టీసర్ 12.94 మిలియన్ వ్యూస్ తో అలాగే 4 లక్షల 55 వేల లైక్స్ తో 24 గంటల విషయం లో అన్ని టీసర్స్ లోకి టాప్ ప్లేస్ లో ఉంది. మరి సరిలేరు నీకెవ్వరు టీసర్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి ఈ రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here