నాచురల్ స్టార్ నాని(Nani) ఎస్ జే సూర్య ల కాంబోలో ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవ్వగా సినిమా ఓవరాల్ గా 41 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా 42 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతూ ఉండగా ఓవరాల్ నైజాంలో 260 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆంధ్ర సీడెడ్ లు కలిపి మరో 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 750 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను..
సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా లో మరో 250 వరకు థియేటర్స్ లో ఓవర్సీస్ లో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా టోటల్ గా వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ 1400 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ అవ్వగా…
కొన్ని చోట్ల బుకింగ్స్ కి ఇంపాక్ట్ పడినా మొత్తం మీద ఇండియాలో ప్రీ బుకింగ్స్ గ్రాస్ 4 కోట్ల మార్క్ ని టచ్ చేయగా వరల్డ్ వైడ్ గా 6 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా నాని కెరీర్ బెస్ట్ మూవీ దసరాతో పోల్చితే ప్రస్తుతానికి సగం బుకింగ్స్ తోనే ఉంది..
దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువగా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టాక్ బాగుంటే షో షో కి కలెక్షన్స్ పరంగా జోరు చూపించి మొదటి రోజు రచ్చ చేయవచ్చు. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు…
6-7 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా, షో షోకి కలెక్షన్స్ లో గ్రోత్ ఉంటే కనుక మొదటి రోజు 8-10 కోట్ల ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. కానీ దీనికి సాలిడ్ గ్రోత్ ఎంతైనా అవసరం అని చెప్పాలి… మరి తొలిరోజు సినిమా ఎలాంటి స్టార్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.