Home న్యూస్ నాని సరిపోదా శనివారం టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలంటే!!

నాని సరిపోదా శనివారం టోటల్ బిజినెస్…హిట్ కొట్టాలి అంటే ఎంత కావాలంటే!!

0
Nani SARIPODHAA SANIVAARAM Movie WW Business and Break Even Target
Nani SARIPODHAA SANIVAARAM Movie WW Business and Break Even Target

సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము దుమారం లేపగా ఒక మాస్ అండ్ ఒక అల్ట్రా క్లాస్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ముందుకు…

నాని నటిస్తున్న సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ప్రమోషన్స్ సాలిడ్ గానే జరగగా ట్రైలర్ కూడా ఆడియన్స్ లో మంచి రీచ్ ను సొంతం అయ్యేలా చేసింది. ఇక సినిమా ఔట్ పుట్ కూడా…

చాలా బాగానే వచ్చింది అన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉండగా బిజినెస్ పరంగా సినిమా మీద ఉన్న బజ్ కి భారీ లెవల్ లో కాకుండా సేఫ్ సైడ్ లో డీసెంట్ బిజినెస్ నే జరిగేలా చూసుకున్నారు టీం. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం టాక్ బాగున్నా అవలీలగా టార్గెట్ ను అందుకునే అవకాశం ఎక్కువ…

మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#SaripodhaaSanivaaram WW Valued Business
👉Nizam: 12.50Cr(Valued)
👉Ceeded: 5Cr
👉Andhra: 12.5CR
AP-TG Total:- 30CR
👉KA+ROI: 5Cr
👉OS – 6Cr
Total WW: 41CR(Break Even – 42CR~)

ఇదీ ఓవరాల్ గా సరిపోదా శనివారం సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ రేంజ్…సినిమా మీద ఉన్న అంచనాలకు ఇంకా ఎక్కువ బిజినెస్ కి స్కోప్ ఉన్నా సేఫ్ సైడ్ బిజినెస్ చేశారని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 42 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి జోరుని సినిమా చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here