బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM) మూవీ భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ తర్వాత ఓవర్సీస్ నుండి ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ ను…
సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక్కడ రెగ్యులర్ షోలకు హిట్ టాక్ ను సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ షోలకు చాలా వరకు వచ్చే రెగ్యులర్ ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే…
సినిమాలో నాని నటించిన తీరు, సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్ అలాగే సెకెండ్ ఆఫ్ ఫస్ట్ అరగంట చాలా బాగా అనిపించింది అని అంటున్నారు. యాక్షన్ డోస్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించినా హీరో విలన్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సన్నివేశాలు బాగా మెప్పించాయని అంటున్నారు..
కానీ లెంత్ కొంచం తగ్గించి ఉంటే బాగుండేది అని చెబుతూ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ నే చెబుతున్నారు…ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే కథ పాయింట్ చాలా రొటీన్ గానే ఉండగా లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగిందని, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి టైం పట్టగా…
సెకెండ్ ఆఫ్ లో యాక్షన్ పార్ట్ అలాగే హీరోయిజం ఎలివేట్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది అంటూ చెబుతున్నారు…లెంత్ తగ్గించి స్క్రీన్ ప్లే మరింత టైట్ గా రాసుకుని ఉంటే సినిమా ఇంకా బెటర్ గా ఉండేదని…అయినా కూడా మినిమమ్ పైసా వసూల్ అనిపించేలా…
సరిపోదా శనివారం ఉందని చెబుతూ రీసెంట్ టైంలో వచ్చిన కమర్షియల్ మూవీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఔట్ పుట్ ఉన్న మూవీగా చెబుతున్నారు. ఓవరాల్ గా ఆల్ మోస్ట్ ఆల్ సెక్షన్ ఆడియన్స్ నుండి కూడా సినిమాకి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రెస్పాన్స్ డే ఎండ్ అయ్యే టైంకి ఇప్పుడు…
సొంతం అవుతూ ఉండటంతో నాని ఖాతాలో ఆల్ మోస్ట్ ఇక హాట్రిక్ విజయాలు నమోదు అయ్యే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది…ఇక ఈ టాక్ తో లాంగ్ వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపిస్తే బిజినెస్ ను అందుకోవడం ఏమాత్రం కష్టం కాదనే చెప్పాలి ఇప్పుడు…