బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో మీడియం రేంజ్ మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie Review) మూవీ….ట్రైలర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా…
వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి ఫస్ట్ టాక్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండీ…స్టోరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ…తప్పు జరిగితే తట్టుకోలేని హీరో తన కోపాన్ని ఒక్క శనివారం మాత్రమే చూపాలని ఫిక్స్ అవుతాడు…
సోకులపాలెం అనే ప్రాంతాన్ని పోలిస్ అయిన ఎస్ జే సూర్య పట్టి పీడిస్తాడు…ఆ ప్రాంతాన్ని కాపాడాలని ఫిక్స్ అయిన హీరోకి విలన్ కి మధ్య జరిగిన గొడవలో ఎవరు గెలిచారు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్ అని చెప్పొచ్చు…. కథ స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా స్టార్ట్ అయినా…
అసలు కథలోకి వెళ్ళడానికి కొంత టైం పట్టగా హీరో క్యారెక్టర్ కొత్తగా అనిపించడంతో ఆ రోల్ చుట్టూ రాసుకున్న సీన్స్ సరదా సరదాగానే సాగడంతో ఫస్టాఫ్ పర్వాలేదు అనిపిస్తూ సాగి ప్రీ ఇంటర్వెల్ నుండి సీరియస్ టర్న్ తీసుకుని ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా…సెకెండ్ ఆఫ్…
హీరో విలన్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ తో ఆకట్టుకున్నా కొంచం డ్రాగ్ అయినట్లు, అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించింది అని అంటున్నారు…లెంత్ తగ్గించి ఉంటే బాగుండేదని, అలాగే కథ పాయింట్ లో బలం ఎక్కువ లేక పోయినా స్క్రీన్ ప్లే పరంగా…
చాలా వరకు మ్యానేజ్ చేసినా ఓవరాల్ గా లెంత్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. అయినా కానీ ఓవరాల్ గా ఫస్టాఫ్ యావరేజ్ గా, సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో ఉందన్న టాక్ అయితే ఓవరాల్ గా వినిపించగా, సినిమా కూడా ఎబో యావరేజ్ రేంజ్ లో ఉందని అంటున్నారు…
మొత్తం మీద ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత సరిపోదా శనివారం సినిమాకి ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ అయితే వినిపిస్తుంది, మాస్ ఎలిమెంట్స్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉండటంతో రెగ్యులర్ షోలకు ఇదే రేంజ్ లో టాక్ వచ్చినా ఇక బాక్స్ అఫీస్ దగ్గర సినిమా రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.