Home న్యూస్ సరిపోదా శనివారం రివ్యూ….ఇది నాని మాస్ శివ తాండవం!!

సరిపోదా శనివారం రివ్యూ….ఇది నాని మాస్ శివ తాండవం!!

0
SARIPODHAA SANIVAARAM Movie Review And Rating
SARIPODHAA SANIVAARAM Movie Review And Rating

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా(Dasara) లాంటి ఊరమాస్ హిట్ ను, తర్వాత హాయ్ నాన్న లాంటి అల్ట్రా క్లాస్ హిట్ ను సొంతం చేసుకున్న  నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie Review) మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా…ఎంతవరకు హైప్ కి తగ్గట్లు మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…అన్యాయం జరిగితే సహించలేని హీరో తన కోపాన్ని ప్రదర్శించడానికి వారంలో శనివారాన్ని ఎంచుకుంటాడు…LIC ఏజెంట్ అయిన హీరో సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు…కానీ సోకులపాలెం వెంట పడుతుంది క్రూరమైన పోలిస్ ఆఫీసర్ అయిన ఎస్ జే సూర్య అని తెలుస్తుంది…

ఇక హీరో విలన్ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ఎవరు గెలిచారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ముందుగా టైటిల్ చూసి ఇదేదో కొత్త కథ అని ఎక్సైట్ ఏమి చూపించాల్సిన అవసరం లేదు…రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో కొత్త కాన్సెప్ట్ తో రూపొందిన కమర్షియల్ మూవీ మాత్రమే… ఇది గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వెళితే సినిమాకి బెటర్ గా ఎంజాయ్ చేయవచ్చు…

ఒక ప్రాంతం…ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న ఒక విలన్…ఆ ప్రాంతాన్ని కాపాడటానికి హీరో వస్తాడు..హీరో విలన్ ల మధ్య గొడవ…ఇలాంటి రెగ్యులర్ ఫార్మాట్ లో చాలా సినిమాలు వచ్చాయి… సరిపోదా శనివారం కూడా అదే పాయింట్ తో వచ్చిన సినిమానే…కానీ ఇక్కడ చేసిన మార్పులు వారంలో ఒకే రోజు కొట్టే హీరో…వారం అంతా హైపర్ యాక్టివ్ గా ఉంటూ క్రూరమైన పనులు చేసే విలన్…

అలాంటి వాళ్ళ మధ్య పోటి ఎలా సాగింది అన్న ఆసక్తికరమైన పాయింట్ తో డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కథని చెప్పిన విధానం చాలా బాగా కుదిరింది…ఫస్టాఫ్ లో కథ కొంచం పడుతూ లేస్తూ సాగుతుంది. హీరో హీరోయిన్ ల లవ్ ట్రాక్ పెద్దగా ఇంపాక్ట్ లేదు కానీ అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయ్యింది…ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి మంచి జోరుతో సాగిన సినిమా…

ఎక్స్ లెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకెండ్ ఆఫ్ ఒక అరగంట ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ మెప్పించగా తర్వాత ఎమోషనల్ సీన్స్ తో మెప్పించి క్లైమాక్స్ కి మంచి సాలిడ్ సీన్ పడుతుంది అనుకున్నా పర్వాలేదు అనిపించేలా క్లైమాక్స్ సాగి ఓవరాల్ గా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది…

నాచురల్ స్టార్ నాని దుమ్ము దులిపేశాడు, హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో రచ్చ చేశాడు…ఇక ఎస్ జే సూర్య నేనేమీ తక్కువ కాదు అనిపిస్తూ ప్రతీ సీన్ లో డామినేట్ చేయగా నాని,ఎస్ జే సూర్య ల ఫేస్ ఆఫ్ సీన్స్ చాలా బాగా వచ్చాయి…ప్రియాంక మోహన్ పర్వాలేదు అనిపించగా మిగిలిన రోల్స్ అందరూ తమ తమ రోల్స్ లో బాగానే చేశాడు…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నా లెంత్ తగ్గించి ఉంటే బాగుండేది, కొన్ని చోట్ల మరీ ఫ్లాట్ గా సినిమా సాగింది…ఇక సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అయిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో జేక్స్ బిజోయ్ ఓ రేంజ్ లో కుమ్మేశాడు….చాలా సీన్స్ ని తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఓ రేంజ్ లో లేపాడు….

ఓవరాల్ గా సరిపోదా శనివారం నార్మల్ పాయింట్ తోనే వచ్చినా కూడా చాలా వరకు ఆడియన్స్ అంచనాలను అందుకునే సినిమా…అదే లో అంచనాలతో వెళితే ఇంకా ఎక్కువ నచ్చుతుంది…. కానీ ఓ రేంజ్ లో ఉంటుంది అనుకుని వెళితే కొంచం అంచనాలను మిస్ అవుతుంది… ఓవరాల్ గా కొంచం లెంత్ తగ్గించి, స్క్రీన్ ప్లే మరింత టైట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది…అయినా కానీ టికెట్ డబ్బులకు వర్త్ అనిపించే సీన్స్ చాలానే ఉండటంతో ఆడియన్స్ మెప్పు పొందటం ఖాయం… మా ఫైనల్ రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here