Home న్యూస్ గ్లిమ్స్ కి దెబ్బ పడినా…టీసర్1 మాత్రం 24 గంటల్లో కుమ్మేసింది..ఇక రచ్చ ఖాయం!

గ్లిమ్స్ కి దెబ్బ పడినా…టీసర్1 మాత్రం 24 గంటల్లో కుమ్మేసింది..ఇక రచ్చ ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ బాక్ టు బాక్ సాలిడ్ హిట్స్ తో దుమ్ము లేపిన నాచురల్ స్టార్ నాని(Nani) ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) లాంటి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు ఆగస్టు లాస్ట్ వీక్ లో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి ఇప్పుడు.

కాగా సినిమా అఫీషియల్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా యూట్యూబ్ లో 24 గంటల్లో మొత్తం మీద నిరాశకలిగించే రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది…గ్లిమ్స్ కి 24 గంటల్లో 2.01 మిలియన్ వ్యూస్ ని అందుకోగా 79.6 వేల లైక్స్ ని మాత్రమే అందుకోగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా సినిమాలో..

విలన్ గా నటిస్తున్న ఎస్ జే సూర్య మీద టీసర్ ను కట్ చేయగా నాట్ ఏ టీసర్ అంటూ రిలీజ్ చేసిన కొత్త టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఎస్ జే సూర్య విలనిజం అలాగే నాని మాస్ యాటిట్యూడ్ తో మెప్పిస్తూ రిలీజ్ చేసిన టీసర్ 1 మొత్తం మీద 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…

24 గంటల్లో వ్యూస్ పరంగా 6.38 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా 121.4K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా టీసర్1 ఆడియన్స్ లో సినిమా మీద మంచి క్యూరియాసిటీని పెంచగా రీసెంట్ టైంలో నాని కెరీర్ లో ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న సరిపోదా శనివారం…

ఆగస్టు లాస్ట్ వీక్ లో రిలీజ్ కానుండగా త్వరలో సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కానుండగా ట్రైలర్ అనుకున్న రేంజ్ లో క్లిక్ అయితే టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. బాక్ టు బాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న నాని ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here