బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి డిఫెరెంట్ జానర్స్ ను ట్రై చేస్తున్న నాచురల్ స్టార్ నాని(Nani) లాస్ట్ ఇయర్ మాస్ రగ్గుడ్ కంటెంట్ తో దసరా సినిమా తీసి కెరీర్ బెస్ట్ రికార్డ్ ను సృష్టించగా తర్వాత అల్ట్రా క్లాస్ మూవీ అయిన హాయ్ నాన్నతో మరో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో చేస్తున్న కొత్త సినిమా…
సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) ఈ నెల ఎండ్ లో రిలీజ్ కాబోతూ ఉండగా ఆల్ రెడీ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి…
కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు ట్రైలర్ లో రివీల్ చేయగా హీరో నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళతాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ను తన ప్రాబ్లం లా భావిస్తాడు…అలాంటి హీరోకి విలన్ అయిన ఎస్ జే సూర్యకి సోకులపాలెం అనే ప్రాంతం సమస్య పై గొడవ మొదలు అవుతుంది…
ఆ గొడవ వళ్ళ హీరో లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు…ఆ తర్వాత విలన్ పై ఎలా గెలిచాడు అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్ లా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది. నాని మాస్ సీన్స్ బాగా ఎలివేట్ అవ్వగా….ఎస్ జే సూర్య విలనిజం కూడా టెర్రిఫిక్ గా ఉండబోతుందని ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది…
ఇక ట్రైలర్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఫస్ట్ ఫ్రేం నుండి చివరి ఫ్రేం వరకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో దంచికొట్టింది…ఓవరాల్ గా రీసెంట్ టైం లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ ట్రైలర్స్ లో ఒకటిగా నిలుస్తుంది సరిపోదా శనివారం ట్రైలర్…
ఇక నాని కి చాలా టైం తర్వాత కంప్లీట్ కమర్షియల్ మాస్ మూవీగా వస్తున్న సరిపోదా శనివారం ట్రైలర్ రేంజ్ లో సినిమా కూడా ఆకట్టుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….