Home న్యూస్ సర్కారు వారి పాట బ్లాస్టర్ రివ్యూ….సూపర్ స్టార్ రాంపేజ్!

సర్కారు వారి పాట బ్లాస్టర్ రివ్యూ….సూపర్ స్టార్ రాంపేజ్!

1518
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో పరశురామ్ పేట్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ సర్కారు వారి పాట… సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహేష్ బాబు చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగుతున్న ఈ సెన్సేషనల్ మూవీ లోని స్పెషల్ టీసర్ కట్ ను మహేష్ బాబు…

పుట్టిన రోజున రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేయగా అనుకోకుండా టీసర్ కట్ లో కొంత భాగం నైట్ లీక్ అవ్వడం జరిగింది. దాంతో మేకర్స్ అనుకున్న టైం కన్నా ముందే నైట్ 12:36 టైం లో ఈ బ్లాస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ బ్లాస్టర్ లో మహేష్ బాబు లుక్స్…

ఇది వరకు మూవీస్ తో పోల్చితే కొంచం డిఫెరెంట్ గా ఉండటం మహేష్ క్యారెక్టర్ కొంచం ఖలేజా మరియు దూకుడు సినిమాల షేడ్స్ ని కలిగి ఉండటం తో ఈ సారి సూపర్ స్టార్ మాస్ రాంపేజ్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది. ఈఫ్ టైగర్ టేక్స్ రాబిట్, హౌ ఇట్ విల్ బి…

సేం ఈఫ్ యు మిస్ ది ఇంట్రెస్ట్ యు విల్ గెట్ ద డేట్ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్స్ క్లాస్ లో మాస్ టచ్ ఇస్తూ మెప్పించాగా ఈ బ్లాస్టర్ లో కీర్తి సురేష్ సీన్స్ ని కూడా 2 పెట్టడం అవి ఆకట్టుకోవడం మహేష్ కౌంటర్స్ ఓవరాల్ గా బ్లాస్టర్ దుమ్ము లేపగా బ్లాస్టర్ కి బ్యాక్ బోన్ లా…

తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ప్రతీ సీన్ కి ఓ రేంజ్ లో ఎలివేట్ అయ్యేలా చేసింది. మొత్తం మీద బ్లాస్టర్ నిజంగానే బ్లాస్టర్ అనిపించుకుంది. ఇక మిడ్ నైట్ సడెన్ రిలీజ్ వలన ఓవరాల్ గా యూట్యూబ్ రికార్డుల పరంగా ఈ బ్లాస్టర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. సడెన్ రిలీజ్ అయినా రికార్డులు కొట్టడం బాగానే స్టార్ట్ చేసింది… 24 గంటల్లో ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here