Home గాసిప్స్ సర్కారు వారి పాట…సెట్ కోసం అన్ని కోట్లా!!

సర్కారు వారి పాట…సెట్ కోసం అన్ని కోట్లా!!

493
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మూడు వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ వరుస డిసాస్టర్ల తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర భరత్ అనే నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు సినిమా లతో సెన్సేషనల్ కంబ్యాక్ అండ్ హాట్రిక్ ని సాధించిన సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు గీత గోవిందం ఫేం పరశురాం తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ అయిన ప్రీ లుక్ అండ్ టైటిల్ తో సినిమా ఎలా ఉండబోతుంది సినిమా కథ పాయింట్ ఏంటి అనేవి చాలా వరకు రివీల్ అవ్వగా, సినిమా కథ మొత్తం బ్యాంక్ చుట్టూ తిరిగుతుందని కన్ఫాం అయింది.

బ్యాంక్ నుండి భారీ అమౌంట్ ని లోక్ తీసుకుని విదేశాలకు పారిపోయిన విలన్ ని హీరో ఎలా తిరిగి ఇండియా పట్టుకొచ్చాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుండగా సినిమా కోసం భారీ సెట్ ని యూనిట్ నిర్మించ బోతున్నట్లు సమాచారం…

4 ఫ్లోర్స్ భారీ బిల్డింగ్ సెట్ లో డిఫెరెంట్ బ్యాంక్ సెటప్స్ తో ఈ భారీ సెట్ ఉంటుందని సమాచారం, సినిమా లో మేజర్ పార్ట్ బ్యాంక్ లోనే షూట్ అవుతుంది కాబట్టి ఎక్కడా రిపీటెడ్ గా అనిపించ కూడదని ఒక్కో ఫ్లోర్ లో ఒక్క రకమైన బ్యాంక్ సెట్ ని వేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సెట్ మొత్తం ఖర్చు కూడా…

ఏకంగా 5 కోట్లకు పైగానే ఖర్చు అవుతుందని సమాచారం, సెట్ కంప్లీట్ అయ్యాక సినిమా షెడ్యూల్ అందులోనే జరుగుతుందని, బ్యాంక్ పార్ట్ కంప్లీట్ షూట్ తర్వాత ఇతర పార్ట్ షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఈ బ్యాంక్ సెట్ కంప్లీట్ అవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ రేసు లో నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here