Home న్యూస్ సర్కారు వారి పాట రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

సర్కారు వారి పాట రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుక 2150 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా భారీగా రిలీజ్ అవ్వగా సినిమా పై ఉన్న అంచనాలు సాలిడ్ గా ఉండటంతో ఆ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా లేదా అన్న విషయాలను తెలుసు కుందాం పదండీ… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

అమెరికాలో ఫైనాన్స్ బిజినెస్ చేసే హీరో దగ్గర హీరోయిన్ స్టడీస్ కోసం అంటూ మనీ తీసుకుంటుంది, ఈ క్రమంలో హీరోయిన్ తో హీరో ప్రేమలో పడగా తర్వాత హీరోయిన్ హీరోని డబ్బు విషయంలో మోసం చేసింది అని తెలుసుకున్న హీరో హీరోయిన్ కోసం ఇండియాకి వస్తాడు… హీరోయిన్ ఫాదర్ అయిన సముద్రఖని దగ్గర హీరో…

డబ్బులు వసూల్ చేయడానికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయి తర్వాత హీరో ఏం చేశాడు అన్నది స్టొరీ పాయింట్… కథ పరంగా అతి సాదారణంగా అనిపించేలా పరశురాం పేట్ల నిరాశ పరిచాడు, కానీ మహేష్ బాబు మాత్రం ఖలేజా దూకుడు రోజులను గుర్తు చేస్తూ ఫుల్ ఎనర్జీ తో ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ తో దుమ్ము లేపాడు…

కొన్ని సీన్స్ ఓవర్ ది టాప్ అనిపించినా సూపర్ స్టార్ తన వరకు కుమ్మేశాడు, కీర్తి సురేష్ కూడా బాగా చేయగా మహేష్ కీర్తి ల పెయిర్ పర్వాలేదు అనిపిస్తుంది, ఇక సముద్రఖని రోల్ జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా వెన్నెల కిషోర్ పర్వాలేదు అనిపించుకున్నాడు… తమన్ సంగీతం ఆకట్టుకోగా పాటలు విజువల్ గా కూడా బాగా మెప్పించాయి… కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా…..

అనుకున్న రేంజ్ లో అయితే తమన్ ఇంప్రెస్ చేయలేక పోయాడు… ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ గా ఉండగా ఫస్టాఫ్ ఎలాగోలా బాగుంది అనిపించినా సెకెండ్ ఆఫ్ చాలా భాగం ట్రాక్ తప్పినట్లు అనిపించింది, సినిమాటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక పరశురాం డైరెక్షన్ విషయానికి వస్తే… తనకి దక్కిన బిగ్ ఛాన్స్ ను……

తను సరిగ్గా వాడుకోలేక పోయాడు, చాలా సింపుల్ స్టొరీ పాయింట్ ని తీసుకుని ఫస్టాఫ్ వరకు ఎలాగోలా లవ్ సీన్స్, లైట్ ఎంటర్ టైన్ మెంట్ తో పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ హీరో విలన్ ల మధ్య పోటి మరీ అనుకున్న రేంజ్ లో లేదు. అయినా కానీ మహేష్ బాబు ఎనర్జిటిక్ రోల్ అండ్ యాటిట్యూడ్ వలన చాలా సీన్స్ నిలబడ్డాయి…. సెకెండ్ ఆఫ్ ని ఇంకా బెటర్ గా…

రాసుకుని ఉంటే బాగుండేది… మొత్తం మీద సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే…. మహేష్ బాబు వన్ మ్యాన్ షో విత్ వింటేజ్ ఖలేజా దూకుడు రేంజ్ కామెడీ, ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఉండటం, కళావతి, పెన్ని, మమ మహేశా సాంగ్స్ ఆకట్టుకోవడం, కొన్ని హీరోయిజం ఎలివేట్ సీన్స్ అని చెప్పాలి… ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే.. స్టొరీ వీక్ గా ఉండటం, సెకెండ్ ఆఫ్ సీన్స్ సాగదీసినట్లు అనిపించడం అని చెప్పాలి….

వీటితో పాటు వీక్ డైరెక్షన్ అని కూడా చెప్పాలి. మొత్తం మీద భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళితే అంత కిక్ ఇచ్చే ఛాన్స్ తక్కువే అని చెప్పాలి. అంచనాలు లేకుండా వెళితే కొన్ని సీన్స్ లాగ్ అనిపించినా మొత్తం మీద సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉందని చెప్పాలి. సూపర్ స్టార్ కోసం ఒకసారి చూడొచ్చు… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here