సైడ్ రోల్స్ నుండి మెయిన్ లీడ్ రోల్స్ కి ఎదిగిన సత్యదేవ్, రెండేళ్ళ క్రితం ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో డిజిటల్ లో మంచి హిట్ ని సొంతం చేసుకున్న తర్వాత వరుస పెట్టి సినిమాలను కమిట్ అయ్యాడు. వాటిలో కొన్ని డిజిటల్ లో కొన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ సే ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్దం అవుతూ ఉంది…..
సినిమా కి పబ్లిసిటీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా చేసినప్పటికీ కూడా జనాలకు అయితే మరీ అనుకున్న రేంజ్ లో అయితే రీచ్ వెళ్ళలేదు అనే చెప్పాలి. దాంతో సినిమా ఇక ఎక్కువ శాతం మౌత్ టాక్ నే నమ్ముకుని ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు.
కానీ బిజినెస్ పరంగా మాత్రం సినిమాకి ఓవరాల్ గా డీసెంట్ అనిపించే రేంజ్ లో బిజినెస్ సొంతం అయింది, కానీ సినిమా పై కామన్ ఆడియన్స్ లో పెద్దగా బజ్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి అందుకోవాల్సిన టార్గెట్ అయితే ఓవరాల్ గా పెద్దదే అని చెప్పాలి ఇప్పుడు…
ఒకసారి గాడ్ సే మూవీ కి జరిగిన ఓవరాల్ వాల్యూ బిజినెస్ ను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 1.3Cr
👉Ceeded: 0.40Cr
👉Andhra: 1.80Cr
AP-TG Total:- 3.5CR
👉Ka+ROI+OS: 1.00Cr
Total WW: 4.50CR
ఇదీ మొత్తం మీద సినిమా కి అన్ని చోట్లా కలిపి జరిగిన వాల్యూ బిజినెస్ లెక్క… మొత్తం మీద 4.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న గాడ్ సే మూవీ…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మినిమమ్ 5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఈ రేంజ్ టార్గెట్ ని సినిమా సూపర్ పాజిటివ్ టాక్ వస్తే తప్ప అందుకోవడం కష్టం ప్రస్తుత బజ్ దృశ్యా… మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.