Home టోటల్ కలెక్షన్స్ సవారీ కలెక్షన్స్: 1.3 కోట్ల టార్గెట్…ఫైనల్ గా వచ్చింది ఇది!!

సవారీ కలెక్షన్స్: 1.3 కోట్ల టార్గెట్…ఫైనల్ గా వచ్చింది ఇది!!

1286
0

2020 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో నందు హీరోగా నటించిన సవారి సినిమా కూడా ఒకటి, సినిమా లో ఒక పాట తో మంచి పాపులారిటీ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కి రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ లభించగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయిన ఈ సినిమా చతికిల బడింది.

సినిమా మొత్తం మీద 1 కోటి రేంజ్ బడ్జెట్ లో రూపొందించార ని సమాచారం. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద 1.2 కోట్లు చేసిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద 1.1 కోట్లకు అటూ ఇటూ గా చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 1.3 కోట్ల కి అటూ ఇటూ గా టార్గెట్ తో బరిలోకి దిగింది, మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ని అందుకునేలా కలెక్షన్స్ ని సాధించ లేక పోయింది. సినిమా మొత్తం మీద నైజాం లో…

11 లక్షల మేర షేర్ ని, ఆంధ్రా లో 10 లక్షల దాకా షేర్ ని ఇక సీడెడ్ 3 లక్షల దాకా షేర్ ని సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా.. టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 24 లక్షల షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా మరో 3 లక్షలు కలిసి టోటల్ గా 27 లక్షల షేర్ ని అందుకుంది.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 1.3 కోట్ల టార్గెట్ కి 27 లక్షల దాకా షేర్ ని అందుకుందట ఈ సినిమా. బిజినెస్ 1.1 కోట్ల లో మొత్తం మీద 83 లక్షల మేర నష్టాన్ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అనిపించుకుంది. హీరోగా ఈ సినిమా తో అయినా హిట్ కొట్టాలి అనుకున్న నందు కి మరో ఫ్లాఫ్ అయ్యింది ఈ సినిమా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here