Home న్యూస్ సీటిమార్ ఫస్ట్ టాక్ వచ్చేసింది….సెన్సార్ డీటైల్స్ ఇవే!!

సీటిమార్ ఫస్ట్ టాక్ వచ్చేసింది….సెన్సార్ డీటైల్స్ ఇవే!!

3702
0

యాక్షన్ హీరో గోపీచంద్ తమన్నా ల కాంబినేషన్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికేట్ ని సొంతం చేసు కుంది. సినిమా టోటల్ రన్ టైం 2 గంటల 18 నిమిషాల లెంత్ తో క్రిస్ప్ గా ఉండబోతుందని సమాచారం.

ఇక సెన్సార్ నుండి సినిమా కి వినిపిస్తున్న టాక్ డీసెంట్ గా ఉందని చెప్పాలి…. ఒక ఊరు, ఆ ఊరికి ఒక సమస్య, ఆ ఊరి నుండి 8 మంది అమ్మాయిలు నేషనల్ కబడ్డీ లీగ్ లో ఆడించి ఆ ఊరి సమస్యని సాల్వ్ చేయాలనీ చూసే కోచ్ గా హీరో నటిస్తారని, వాళ్ళని ఆపాలని చూసే…

విలన్స్ ను అడ్డుకుని హీరో అనుకున్నది ఎలా సాధించాడు అన్నది స్టొరీ పాయింట్ గా ట్రైలర్ లో చూపెట్టగా సినిమా కథ కూడా అదే విధంగా ఉంటుందని, అటు స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ తో పాటు కమర్షియల్ యాంగిల్ లో మాస్ ఫైట్స్ తో బాలెన్స్ గా ఉన్న సినిమా….

కథ పాయింట్ మరీ గొప్పది కాకున్నా ఆకట్టుకునేలా మెప్పించడం ఖాయమని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా ఈజీగా రీసెంట్ టైం లో గోపీచంద్ నుండి వచ్చిన మూవీస్ లో బెస్ట్ అనిపించే విధంగా ఉన్న సినిమా అన్న ధీమాగా చెబుతూ ఉండటం తో సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది కచ్చితంగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి…

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఈ నెల 10 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా టాలీవుడ్ తరుపున సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ థియేటర్స్ లో భారీగా రిలీజ్ అవుతున్న మొదటి సినిమాగా రాబోతుంది ఈ సినిమా….. మరి సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఆడియన్స్ ను అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here