Home న్యూస్ అక్కడ రిలీజ్ ఆగిపోయింది…అదే బిగ్గెస్ట్ ప్లస్ అయింది!

అక్కడ రిలీజ్ ఆగిపోయింది…అదే బిగ్గెస్ట్ ప్లస్ అయింది!

6129
0

యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ సీటిమార్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా మొదటి రోజు మంచి జోరు ని చూపెట్టి దుమ్ము లేపుతూ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 50% లిమిటేషన్ లు అలాగే లో టికెట్ రేట్లు ఉన్నప్పటికీ కూడా సూపర్బ్ కలెక్షన్స్ ని…

సొంతం చేసుకుని దుమ్ము లేపింది… ఇక్కడ సినిమా ఇంత గొప్పగా ఉందా అంటే ఒక పక్కా మాస్ ఫైట్స్ తో కూడుకున్న రొటీన్ మాస్ మూవీ… కానీ యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో క్లిక్ అవ్వడం, తమన్నా జ్వాలా రెడ్డి సాంగ్, గోపీచంద్ మాస్ ఎలివేషన్స్ లాంటివి…

సినిమా కి అద్బుతంగా కలిసి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపేలా చేశాయి. కానీ ఇదే టైం లో సినిమా కనుక ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను కనుక జరుపుకుంటే ఈ రేంజ్ లో ఇంపాక్ట్ అస్సలు ఉండక పోయేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు…

అమెరికాలో తెలుగు సినిమాలు అన్నీ రిలీజ్ రోజు కన్నా ముందే ప్రీమియర్స్ తో అక్కడ రిలీజ్ అవ్వడం ఇక్కడ రెగ్యులర్ షో పడక ముందే సినిమా టాక్ నైట్ కే బయటికి రావడం అన్ని సినిమాలకు జరుగుతుంది. అక్కడ క్లాస్ మూవీస్ కి టాక్ సూపర్ పాజిటివ్ గా మాస్ మూవీస్ కి మిక్సుడ్ గా ఎక్కువగా వస్తూ ఉంటుంది.. ఈ లెక్కన సినిమా అక్కడ రిలీజ్ ముందే అయ్యి ఉంటే…

కచ్చితంగా రొటీన్ మాస్ మూవీ అంటూ టాక్ అక్కడ నుండే మిక్సుడ్ గా వచ్చి ఉండేది, అది ఇక్కడ టాక్ పై ఇంపాక్ట్ చూపేది.. కానీ అక్కడ షోలు కొన్ని కారణాల వలన ఆగిపోవడం సినిమా కి ఇక్కడ టాక్ ఓ రేంజ్ లో స్ప్రెడ్ అయ్యేలా చేసింది. మాస్ సెంటర్స్ తో పాటు క్లాస్ ఏరియాల్లో కూడా సినిమా ఇప్పుడు సూపర్ కలెక్షన్స్ తో దూసుకు పోయేలా చేసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here