బాలీవుడ్ లో ప్రీ కోవిడ్ టైంలో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న అక్షయ్ కుమార్ కెరీర్ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది… ఒక్క సూర్యవంశీ సినిమా తప్పితే మిగిలిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయింది. లాస్ట్ ఇయర్ చేసిన అన్ని సినిమాలు తీవ్రంగా నిరాశ పరచగా డిజిటల్ లో కూడా అక్షయ్ కుమార్ మూవీస్ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదు….
ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ సేల్ఫీలో మరో హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తూ ఉండగా ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా హిందీ రీమేక్ గా తెరకెక్కుతూ ఉండగా సినిమా ఒరిజినల్ వర్షన్ హిందీ డబ్ వర్షన్…
ఆల్ రెడీ అందుబాటులోనే ఉన్నా కూడా హిందీ రీమేక్ తెరకెక్కడం ఇప్పుడు యూనిట్ అంతా కలిసి సినిమాను ఎంతో కష్టపడి ప్రమోట్ చేసినా కానీ ఇప్పుడు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి అని చెప్పాలి…
సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నీరసంగా ఉండటంతో సినిమా కి ఓపెనింగ్స్ 5 కోట్ల లోపే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. టాక్ అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే తప్పితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా గ్రోత్ ని చూపించవచ్చు అంటున్నారు కానీ మొత్తం మీద అక్షయ్ కుమార్ మూవీస్ కి ఇలాంటి పరిస్థితి రావడం బాలీవుడ్ కి మైండ్ బ్లాంక్ చేస్తుంది అని చెప్పాలి.