Home న్యూస్ షాదీ ముబారక్ రివ్యూ…బానే ఉంది కానీ!!

షాదీ ముబారక్ రివ్యూ…బానే ఉంది కానీ!!

0

మార్చ్ 4 న రిలీజ్ అయిన సినిమాల్లో నోటబుల్ మూవీస్ లో ఒకటి షాదీ ముబారక్, చక్రవాకం, మొగలిరేకులు ఫేం సాగర్ నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడంతో సడెన్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎంతవరకు అంచనాలను తట్టుకుందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే… ఒకే రోజు మూడు పెళ్లిచూపులు చూసి ఎవరో ఒకరిని ఓకే చేద్దాం అని ఇండియా వచ్చిన హీరో కి ఆ ముగ్గురు అమ్మాయిలను చూపెట్టే భాద్యత హీరోయిన్ తీసుకుంటుంది.

ఈ క్రమంలో వీళ్ళకి మొదట గొడవలు జరిగినా తర్వాత ప్రేమించుకుంటారు కానీ ఒకరికొకరు చెప్పుకోరు, హీరో ఇంతలో పెల్లిచూపుల్లో ఒక అమ్మాయిని ఓకే చేస్తాడు, తర్వాత ఎం జరిగింది, ఈ ఇద్దరు కలిశారా లేదా లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి కథ పాయింట్ లు మనం ఎన్నో చూసి చూసి ఉన్నాం, ఇక్కడ కూడా సేం అదే కథ పాయింట్ కానీ…

అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి, స్క్రీన్ ప్లే బాగా రాసుకోవడం సీన్స్ ని బాగా తెరకెక్కించడంతో సిల్లీ స్టొరీనే అయినా కానీ సీన్స్ ఆకట్టుకుంటూ సినిమా చాలా వరకు మెప్పిస్తుంది, తర్వాత సీన్ ఎం అవుతుంది అన్నది ఆడియన్స్ ఈజీగా గెస్ చేస్తారు… ట్విస్ట్ లు టర్న్ లు కూడా ఈజీగా చెప్పే విధంగా ఉండటం లాంటివి సినిమా మైనస్ పాయింట్స్…

అలాగే లీడ్ పెయిర్ ఇద్దరూ బాగానే నటించినా ఎమోషనల్ సీన్స్ లో ఇద్దరూ తేలిపోయారు, కానీ మొత్తం మీద మెప్పించగా, సాంగ్స్ ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు, ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది, సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే… ముందే చెప్పినట్లు కథ పాయింట్ చాలా సిల్లీగా సింపుల్ గా అనిపిస్తుంది.

కానీ సీన్ బై సీన్ ఆకట్టుకునే సీన్స్ చాలానే ఉండటం తో వాటితోనే సినిమా ఎంటర్ టైన్ చేస్తుంది, సో కథ పట్టించుకోకుండా జస్ట్ టైం పాస్ కోసం ఒక సినిమా చూడాలి అనుకుంటే షాదీ ముబారక్ సినిమా చాలా వరకు మెప్పిస్తుంది, కథ కొత్తగా ఉండాలి లాంటి కండీషన్స్ ఉంటె సినిమా జస్ట్ ఓకే అనిపిస్తుంది. మొత్తం మీద బాగుంది కానీ అది సీన్స్ వరకు మాత్రమే కాబట్టి 2.5 రేటింగ్ ఇస్తున్నాం, రొటీన్ అయినా కానీ సినిమా ఎంటర్ టైన్ చేస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here