దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ షాదీ ముబారక్, చిన్న సినిమానే అయినా దిల్ రాజు పేరు మీద సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, అలాగే రిలీజ్ అయిన తర్వాత సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు ఒకసారి ఈజీగా చూడొచ్చు అన్న టాక్ కూడా వచ్చింది, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం లేదా ఆడియన్స్ కి సినిమా పై మినిమమ్ కూడా ఆసక్తి లేకపోవడంతో…
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ డిసాస్టర్ గా పరుగును ముగించింది, సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 4 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, ఇక వీకెండ్ లో కొద్దిగా జోరు చూపిన ఈ సినిమా 12 లక్షల షేర్ తో వీకెండ్ ని ముగించగా…
తర్వాత కంప్లీట్ గా చేతులు ఎత్తేసిన ఈ సినిమా పరుగును అతి త్వరగానే ముగించింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఈ సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ 15-16 లక్షల రేంజ్ లో ఉంటాయని సమాచారం. అది కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీసెయకుండా చెప్పిన కలెక్షన్స్.
మొత్తం మీద సినిమా బిజినెస్ 2.55 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుని ట్రేడ్ ఆశ్యర్యపోయేలా చేసింది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కచ్చితంగా సినిమా జోరు చూపుతుంది అనుకుంటే కేవలం 15 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.8 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా మొత్తం మీద లాస్ 2.65 కోట్ల రేంజ్ లో ఉంది…
బిజినెస్ నుండే లాస్ చూసుకుంటే 2.4 కోట్ల రేంజ్ లో లాస్ ని సొంతం చేసుకుని బిగ్ డిసాస్టర్ గా నిలిచింది, సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ బరిలో చూపలేక పోయింది, ఇక సినిమాను దిల్ రాజు కూడా ఏమాత్రం పబ్లిసిటీ చేయక పోవడం అందరినీ ఆశ్యర్యపరిచింది, అది కూడా సినిమా రిజల్ట్ పై తీవ్రంగా ఇంపాక్ట్ ని చూపింది అని చెప్పాలి.